MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్‌నాథ్ షిండే

గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.

MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్‌నాథ్ షిండే

Mva Crisis (1)

MVA Crisis: మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలో ఉన్న మహా వికాస్ అఘాది (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి) ప్రభుత్వం అసహజమైన కలయిక అని అభిప్రాయపడ్డారు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే. తాజా పరిణామాలపై బుధవారం సాయంత్రం ఆయన ట్వీట్లు చేశారు. సీఎం ఉద్ధవ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రసంగించిన అనంతరం షిండే ట్వీట్లు చేశారు.

MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

శివసేన పార్టీ మనుగడ సాగించాలంటే ఆ కూటమి నుంచి బయటకు రావాలని కోరారు. ‘‘గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి. మహారాష్ట్ర మంచి కోసం నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రం కోసమే’’ అని షిండే తన ట్వీట్లలో పేర్కొన్నారు.

TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు

మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే బుధవారం ఉద్ధవ్ ఇంటికి వెళ్లారు. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు షిండే వైపు వెళ్తున్నఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. షిండే వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.