Home » Author »Narender Thiru
రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిందో వాహనం. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.
యాకుస్క్లో చలికాలంలో సాధారణంగా మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఇప్పుడు మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.
ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీ ద్వారా తన కెరీర్‌ను ముగించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా పాల్గొంటారు.
శుక్రవారం (జవనరి 13) నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. పేటీఎమ్ యాప్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్ ఆర్ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు.
ఆరంభ మ్యాచ్‌లో శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. 2–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహి దాస్ తొలి గోల్ కొట్టి భారత గోల్స్ ఖాతా తెరిచాడు.
తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.
అభినవ్ ప్రకాష్ అనే వ్యక్తి బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థలో టిక్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి స్నేహితులు రాకేష్, కునాల్‌కు ఇటీవల ఇద్దరు అమ్మాయిలు రోడ్ ట్రిప్పులో పరిచయమయ్యారు.
2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది.
ఈ కారణంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో శ్రీ నగర్ నుంచి బయల్దేరాల్సిన విమానాల్ని ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు.
ఈ సైనిక విన్యాసాల్లో ఇండియాతో కలిసి అనేక ఆఫ్రికా దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ విన్యాసాల వల్ల ఇండియా–ఆఫ్రికా దేశాల మధ్య సైనిక సహకారం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు.
లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు. తన పేరు మౌర్యగా చెప్పి, ఆమెను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు.
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా, గురువారం శ్రీలంక–ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ 2021లో పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన పాక్ రాయబార కార్యాలయ అధికారులు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.
కొద్ది రోజులుగా ఇక్కడి పర్వత ప్రాంతంలో హిమాపాతం ఆందోళన కలిగిస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు.
మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్‌ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.