Delhi: స్నేహితుల కోసం విమానంలో బాంబు ఉందని బెదిరించిన యువకుడు.. అరెస్టు

అభినవ్ ప్రకాష్ అనే వ్యక్తి బ్రిటీష్ ఎయిర్‌‌వేస్ సంస్థలో టిక్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి స్నేహితులు రాకేష్, కునాల్‌కు ఇటీవల ఇద్దరు అమ్మాయిలు రోడ్ ట్రిప్పులో పరిచయమయ్యారు.

Delhi: స్నేహితుల కోసం విమానంలో బాంబు ఉందని బెదిరించిన యువకుడు.. అరెస్టు

Updated On : January 13, 2023 / 7:50 PM IST

Delhi: స్నేహితుల ప్రేమ కోసం ఏదో ఒకటి చేసి విమానాల్ని ఆపే సన్నివేశాల్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే, నిజంగా కూడా ఒక వ్యక్తి స్నేహితుల కోసం అలాంటి పనే చేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం జరిగింది.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

అభినవ్ ప్రకాష్ అనే వ్యక్తి బ్రిటీష్ ఎయిర్‌‌వేస్ సంస్థలో టిక్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి స్నేహితులు రాకేష్, కునాల్‌కు ఇటీవల ఇద్దరు అమ్మాయిలు రోడ్ ట్రిప్పులో పరిచయమయ్యారు. అయితే, వాళ్లు స్పైస్ జెట్ సంస్థకు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి పూనేకు వెళ్తున్నారు. గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ విమానం బయల్దేరాల్సి ఉంది.

MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

అయితే, విమానం టేకాఫ్ అయ్యే సమయానికి అభినవ్ ఎయిర్‌‌పోర్టుకు ఫోన్ చేసి, పూనే వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో బాంబు ఉందని బెదిరించాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు విమనాన్ని నిలిపి వేశారు. ప్రయాణికుల్ని దించేశారు. విమానాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. అయితే, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు.

Srinagar Airport: శ్రీనగర్‌‌ ఎయిర్‌‌పోర్టులో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన విమానాలు

తర్వాత ఈ కాల్ గురించి విచారణ ప్రారంభించగా అభినవ్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు విషయం బయటపడింది. మిగతా నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.