Pakistan: పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్

ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.

Pakistan: పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్

Updated On : January 16, 2023 / 4:49 PM IST

Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గోధుమ పిండి కోసం ప్రజలు గంటలతరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై దాడికి జైషే మహమ్మద్ కుట్ర.. నిఘా వర్గాల వెల్లడి

కొన్ని పదార్థాల ధరలు 400 శాతంపైగా పెరిగాయంటే అక్కడ ధరల సక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి. అంటే 437 శాతం పెరుగుదల కనిపిస్తోంది. గతేడాది జనవరిలో చికెన్ ధర 203 రూపాయలుండగా ప్రస్తుతం 366, సబ్బు గత జనవరిలో 54 రూపాయలుండగా ప్రస్తుతం 88 రూపాయలుగా ఉంది. గోధుమ పిండి 20 కేజీల బ్యాగ్ ధర 1161 నుంచి 1812 రూపాయలకు పెరిగింది.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

పప్పు ధర 172 నుంచి 262 రూపాయలకు పెరిగింది. పాలు ఒక లీటర్ 115 నుంచి 150 రూపాయలకు, డజన్ అరటి పండ్లు 83 రూపాయల నుంచి 121 రూపాయలకు, ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2373 నుంచి 2680కి పెరిగింది. ఈ ధరలు పాకిస్తాన్ రూపాయలకు సంబంధించినవి. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రజలు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహారం దొరకడంలేదు.

Chandrababu Naidu: పీలేరులో ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఫ్లెక్సీల కలకలం

తాజాగా పాక్‌లో ఆహారం కొరత ఎలా ఉందో తెలియజెప్పే ఒక వీడియో బయటపడింది. ఆ వీడియోలో ఆహారం తీసుకెళ్తున్న ఒక ట్రక్కును కొందరు బైకులపై వెంటాడుతున్నారు. వాహనాన్ని వెంటాడుతూ, డబ్బులు తీసుకుని, తమకు గోధుమ పిండి బ్యాగ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇలాంటి దృశ్యాలు ప్రస్తుతం పాక్‌లో నిత్యకృత్యమయ్యాయి.