Home » Author »Narender Thiru
సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20.
దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులప�
పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.
చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి. ఇక్కడ సాధారణంకంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్�
జూన్ నెలాఖరులోగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వాళ్లు కంటి పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తారు.
తర్వాత అతడు కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. అప్పుడే ఆ లగేజ్‌లో ఉన్న బాంబ్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హ
శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు.
లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగుల
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
స్థానిక మైలాన్ పరిశ్రమలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమ వేర్‌హౌజ్ లోపల ఒక డ్రమ్ములోని ద్రావణాన్ని, మరో డ్రమ్ములోకి మారుస్తుండగా పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళానికి చెందిన లోకేశ్వర్ రావుత
అక్కడ అక్రమంగా ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు గుర్తించింది. వీళ్లు తమ వీసీ గడువు ముగిసినప్పటికీ, ఢిల్లీలోనే ఉంటున్నారు. వాళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ తరలించాలనుకున్నారు. అలా ఐదుగురిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగ�
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష�
టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు వ�
ఒక యూఎఫ్ఓ (గ్రహాంతర నౌక)ను రష్యా సైన్యం కూల్చేసిందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రష్యన్ మీడియా కూడా అనేక కథనాల్ని ప్రసారం చేస్తోంది. రష్యన్ మీడియా కథనం ప్రకారం.. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో, ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెల�
ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు.
యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది.
ఈ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు.
అప్పటికే ప్రమాదానికి గురైన ఒక ట్యాంకర్‌కు ముందు చక్రాలు ఊడిపోయాయి. మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గ�