Kanti Velugu: 18 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు.. వంద రోజులపాటు నిర్వహణ
జూన్ నెలాఖరులోగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వాళ్లు కంటి పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తారు.

Kanti Velugu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటివెలుగు రెండో విడత కార్యక్రమం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. వంద రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమంపై ఇటీవలే తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంటి వెలుగు నిర్వహించే జిల్లాలోని జనాభానుబట్టి అవసరమైన వైద్య బృందాలను కేటాయించనుంది ప్రభుత్వం. గతంలో ఈ కార్యక్రమం ఎనిమిది నెలలపాటు సాగింది. ఇప్పుడు మాత్రం సెలవు దినాలు మినహాయించి వంద రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ సారి గతంలోకంటే అదనంగా 1500 బృందాలను కేటాయిస్తోంది. జూన్ నెలాఖరులోగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వాళ్లు కంటి పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తారు.
Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 75 రవాణా బస్సులు అందజేసిన ఇండియా
18 సంవత్సరాలు దాటిన వాళ్లు ఎవరైనా ఉచితంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడా కార్యక్రమం మధ్యలో ఆగిపోకుండా బఫర్ టీమ్‌లను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అనేక చోట్ల మంత్రులు, అధికారులు దీనికోసం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించనుంది.