CM Manik Saha: బీజేపీ గంగా నది లాంటిది.. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరి, పాపాల్ని పోగొట్టుకోవాలి: త్రిపుర సీఎం

ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.

CM Manik Saha: బీజేపీ గంగా నది లాంటిది.. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరి, పాపాల్ని పోగొట్టుకోవాలి: త్రిపుర సీఎం

CM Manik Saha: బీజేపీ గంగా నది లాంటిదని, బీజేపీలో చేరితే ప్రతిపక్ష నేతల పాపాలు పోతాయని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. త్రిపుర, కక్రాబన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక సభలో మాణిక్ సాహా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. త్రిపురలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి

ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి. ఇప్పటికీ లెనిన్, స్టాలిన్ సిద్ధాంతాల్ని నమ్మేవాళ్లు వాటిని వదిలి బీజేపీలో చేరాలి. బీజేపీ అనే రైలులో బోగీలు ఖాళీగానే ఉన్నాయి. ఎవరైనా ఖాళీ బోగీల్లో ఎక్కితే చాలు.. మోదీ వాళ్లను గమ్యస్థానానికి చేరుస్తారు’’ అని మాణిక్ సాహా అన్నారు. మరోవైపు గతంలో త్రిపురలో కమ్యూనిస్టుల పాలనపై కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టులు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.

‘‘కమ్యూనిస్టుల పాలనలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. వాళ్లు హింస, తీవ్రవాద కార్యకలాపాల్నే నమ్ముకుంటారు. దక్షిణ త్రిపుర జిల్లాలో, కమ్యూనిస్టుల పాలనలో 69 మంది ప్రతిపక్ష నేతలు హత్యకు గురయ్యారు. కక్రాబన్ ప్రాంతం కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడ కూడా ఎందరో నేతలు హత్యకు గురయ్యారు’’ అని మాణిక్ సాహా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు.