Sangareddy: సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
స్థానిక మైలాన్ పరిశ్రమలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమ వేర్‌హౌజ్ లోపల ఒక డ్రమ్ములోని ద్రావణాన్ని, మరో డ్రమ్ములోకి మారుస్తుండగా పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళానికి చెందిన లోకేశ్వర్ రావుతోపాటు బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా, బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

Sangareddy: సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. స్థానిక మైలాన్ పరిశ్రమలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమ వేర్‌హౌజ్ లోపల ఒక డ్రమ్ములోని ద్రావణాన్ని, మరో డ్రమ్ములోకి మారుస్తుండగా పేలుడు ఘటన జరిగింది.
China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి
ఈ పేలుడు ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళానికి చెందిన లోకేశ్వర్ రావుతోపాటు బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా, బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.