Virat Kohli: సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డు సమం

సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20.

Virat Kohli: సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డు సమం

Updated On : January 9, 2023 / 5:42 PM IST

Virat Kohli: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. స్వదేశంలో మరో సెంచరీ సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన ఆటగాడిగా నిలుస్తాడు కోహ్లీ. మంగళవారం ఇండియా-శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే విరాట్ కోహ్లీ ఆ ఫీట్ అందుకుంటాడు.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

క్రికెట్ చరిత్రలో అనేక రికార్డులు నెలకొల్పారు సచిన్ టెండూల్కర్. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచారు. వంద సెంచరీలు చేశాడు. అలాగే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేశాడు. సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20. మొత్తం ఇండియాలో 164 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్ 20 సెంచరీలు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు మన దేశంలో 101 వన్డేలు ఆడిన కోహ్లీ, 19 సెంచరీలు నమోదు చేశాడు. మరో సెంచరీ సాధిస్తే సచిన్‌తో సమానంగా నిలుస్తాడు.

Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం

స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం శ్రీలంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మన దేశంలోనే సాగుతోంది. దీంతో ఈ సిరీస్‌లో కోహ్లీ ఒక సెంచరీ సాధిస్తే, సచిన్ రికార్డును సమం చేసినట్లవుతుంది. మరో సెంచరీ సాధిస్తే, సచిన్ రికార్డును బ్రేక్ చేసినట్లవుతుంది. ప్రస్తుతం కోహ్లీ ఫ్యాన్స్ దీని కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ టోర్నీలో సెంచరీ సాధించి, కోహ్లీ రికార్డు సృష్టిస్తాడేమో చూడాలి. సచిన్‌తో పోలిస్తే, కోహ్లీ అతి తక్కువ సమయంలోనే ఈ రికార్డ్ నెలకొల్పుతుండటం విశేషం. మన దేశంలో 2019 నుంచి ఇప్పటివరకు కోహ్లీ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.