CI SUDHAKAR: భూ వ్యవహారంలో మోసం.. అంబర్‌‌పేట సీఐ సుధాకర్ అరెస్టు

సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్‌ ఆర్‌‌ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్‌‌ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు.

CI SUDHAKAR: భూ వ్యవహారంలో మోసం.. అంబర్‌‌పేట సీఐ సుధాకర్ అరెస్టు

Updated On : January 13, 2023 / 9:54 PM IST

CI SUDHAKAR: భూ విక్రయం పేరుతో ఎన్‌ఆర్‌‌ఐని మోసం చేసిన కేసులో హైదరాబాద్, అంబర్‌‌పేట సీఐ సుధాకర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం పోలీసులు సుధాకర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్‌పై 2–0 గోల్స్‌తో గెలుపు

సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్‌ ఆర్‌‌ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్‌‌ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు. నకిలీ ఎమ్మార్వోను సృష్టించి, ఎన్‌ఆర్‌‌ఐ దగ్గరి నుంచి డబ్బు తీసుకున్నాడు. ల్యాండ్‌కు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ మోసంలో సస్పెండెడ్ ఆర్ఐ కూడా సహకరించాడు.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత భూమిని విక్రయించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఎన్ఆర్ఐ ఇటీవల వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. సీఐపైనే ఆరోపణలు రావడంతో ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత జరిపిన విచారణలో సీఐ సుధాకర్ చేసిన మోసాన్ని గుర్తించారు. దీంతో తాజాగా పోలీసులు సుధాకర్‌‌ను అరెస్ట్ చేశారు.. ఈ ఘటనలో మోసానికి పాల్పడ్డ సస్పెండెడ్ ఆర్ఐ రాజేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.