Jammu and Kashmir: కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

కొద్ది రోజులుగా ఇక్కడి పర్వత ప్రాంతంలో హిమాపాతం ఆందోళన కలిగిస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు.

Jammu and Kashmir: కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

Updated On : January 12, 2023 / 5:04 PM IST

Jammu and Kashmir: జమ్ము–కాశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలను చలి, మంచు వణికిస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్‌‌లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. కాశ్మీర్‌‌లోని గందేర్‌‌బల్ ప్రాంతంలో హిమపాతం సంభవించడంతో ఒక వ్యక్తి మరణించారు. మరొకరు గల్లంతయ్యారు.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

గురువారం ఈ ఘటన జరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడి పర్వత ప్రాంతంలో హిమాపాతం ఆందోళన కలిగిస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. హిమపాతం సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. హిమపాతంలో మరణించిన వ్యక్తిని ఒక కూలీగా గుర్తించారు. గల్లంతైన మరొక వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

YouTube channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు.. ఆరు ఛానెల్స్ నిషేధించిన కేంద్రం

ఇప్పటికే హిమపాతం, చలితో వణుకుతున్న జమ్ము–కాశ్మీర్ వాసులకు మరో ప్రమాదం పొంచి ఉంది. గురువారం సాయంత్రం నుంచి మరింతగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం పడే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలిగుప్పిట్లో మగ్గిపోతున్నారు.