Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

Updated On : January 12, 2023 / 3:02 PM IST

Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి, విమర్శలు ఎదుర్కొన్న నుపుర్ శర్మకు తాజాగా గన్ లైసెన్స్ మంజూరైంది. ఆమెకు పలువురి నుంచి ప్రాణహాని పొంచి ఉన్న దృష్ట్యా ప్రభుత్వం నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు చేసింది.

Army Chief Manoj Pandey: చైనా సరిహద్దు సురక్షితం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం

అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు ఇస్లాం దేశాలు కూడా ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే, ఆమెను చంపుతామని అనేక మంది బెదిరించారు. పలు అంతర్జాతీయ ఇస్లాం అతివాద సంస్థల నుంచి కూడా బెదిరింపులు వ్యక్తమయ్యాయి.

India vs Sri lanka 1st odi: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక 

దీంతో ఆమెకు ప్రభుత్వం భద్రత కల్పించింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు, క్షమాపణలు కోరుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయినప్పటికీ, ఆమె వ్యాఖ్యల విషయంలో వివాదం సద్దుమణగలేదు. నుపుర్ శర్మపై అనేక చోట్ల ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదయ్యాయి. ఆమెకు బెదిరింపులూ ఆగలేదు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి షో నిలిపివేత.. బాలయ్య ఫ్యాన్స్‌పై అమెరికన్ థియేటర్ ఓనర్ ఆగ్రహం..

దీంతో తనకు తీవ్రమైన ప్రాణహాని పొంచి ఉందని, తన భద్రత కోసం లైసెన్స్‌డ్‌ గన్ మంజూరు చేయాలని ఆమె ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన ఉన్నతాధికారులు తాజాగా పర్సనల్ లైసెన్స్‌డ్ గన్ మంజూరు చేశారు.