YouTube channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు.. ఆరు ఛానెల్స్ నిషేధించిన కేంద్రం

మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్‌ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.

YouTube channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు.. ఆరు ఛానెల్స్ నిషేధించిన కేంద్రం

YouTube channels: తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆరు యూట్యూబ్ ఛానెల్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెక్) విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్‌ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది. వీటికి మొత్తం 20 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెల్స్ వీడియోస్‌కు 51 కోట్లకుపైగా వ్యూస్ నమోదయ్యాయి. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఛానెల్స్ అబద్ధపు సమాచారాన్ని అందిస్తూ వీక్షకుల్ని తప్పుదోవపట్టిస్తున్నాయి.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి షో నిలిపివేత.. బాలయ్య ఫ్యాన్స్‌పై అమెరికన్ థియేటర్ ఓనర్ ఆగ్రహం..

సుప్రీంకోర్టు, పార్లమెంట్ వ్యవహారాలు, ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా అనేక అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వీక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్, ఇమేజెస్ వాడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. గుర్తింపు కలిగిన పలు టీవీ ఛానెళ్లు, న్యూస్ యాంకర్స్ ఇమేజెస్ వాడుతూ వీక్షకుల్ని మోసం చేస్తున్నాయి.

దీంతో వీక్షకులు వీటికి ఆకర్షితులై, ఇందులో వస్తున్న సమాచారం నిజమే అనుకుని మోసపోతున్నారు. అందుకే కేంద్రం వీటిపై నిషేధం విధించింది. గతంలో కూడా వందల సంఖ్యలో ఛానెల్స్‌ను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.