కమింగ్ సూన్ : కోవిడ్‌‌ను గుర్తించే కొత్త యాప్ వస్తోంది..

కమింగ్ సూన్ : కోవిడ్‌‌ను గుర్తించే కొత్త యాప్ వస్తోంది..

Building an App to Notify Users of COVID-19 Exposure : కరోనావైరస్ గుర్తించే కొత్త యాప్ వస్తోంది. అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఈ కొత్త యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో కొవిడ్‌-19ను గుర్తించే అల్గోరిథంను రీసెర్చర్లు డెవలప్ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT) పరిశోధకులు ఈ యాప్‌ టెక్నాలజీ రూపొందించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌  (AI) విధానంలో ఈ టెక్నాలజీని రెడీ చేశారు.

దగ్గుతో బాధపడుతున్న రోగుల్లో 98.5 శాతం కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు, అసింప్టోమాటిక్ కేసులతో బాధపడుతున్న వారిలో వంద శాతం విజయవంతంగా ఈ అల్గోరిథం గుర్తించిందని పరిశోధకులు వెల్లడించారు. దీని టెక్నాలజీని స్మార్ట్ ఫోన్లలో సాంకేతికతకు బదులుగా యాప్ ద్వారా సపోర్ట్ చేసేలా ప్రయత్నాలు కొనసాగించారు. AI కోవిడ్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఎక్కడైనా ఏ ప్రదేశంలో నుంచి అయినా కరోనాను గుర్తించవచ్చు.

వీలైనంత తొందరగా యాప్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఇన్ స్టంట్ కొవిడ్ -19 టెస్టులు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దాంతో ప్రాణాలను కాపాడేందుకు యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. రెగ్యులేటరీ ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని యాప్‌గా ప్రజలకు అందుబాటులోకి తేవాలని MIT పరిశోధకులు భావిస్తున్నారు.