ట్రంప్ గెలవాలంటే అదొక్కటే మార్గం

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 06:38 AM IST
ట్రంప్ గెలవాలంటే అదొక్కటే మార్గం

Donald Trump or Joe Biden? అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ విజయం దాదాపు ఖరారైనట్లే అందరూ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్ ‌కు అత్యంత చేరువలో ఉన్నారు. ఇక ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి.



అయితే, ట్రంప్ ​కు విజయావకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడవ్వాలంటే…ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎలక్టోరల్‌ ఓట్లన్నీ ట్రంప్‌కే దక్కాలి. ఓట్ల లెక్కింపు జరుగుతున్న నెవాడా,జార్జియా,పెన్సిల్వేనియా,నార్త్‌ కరోలినా, అలస్కా రాష్ట్రాల్లో ట్రంప్‌ తప్పనిసరిగా గెలవాలి. నెవాడాలో 6, జార్జియాలో 16, పెన్సిల్వేనియాలో 20, నార్త్‌ కరోలినాలో 15 అలస్కాలో 3 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి.



https://10tv.in/us-election-2020-why-the-poll-results-may-be-delayed/
ఇవన్నీ గెలిస్తేనే ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని చేరుకుంటారు. మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడతారు. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది అంత సులభంగా సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. కీలక రాష్ట్రమైన జార్జియాలో ట్రంప్‌, బైడెన్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జార్జియాలో ట్రంప్‌ గెలిస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల ఫలితం మరింత ఉత్కంఠగా మారనుంది. అటు పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కాలోనూ ట్రంప్‌ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.



డెమొక్రాట్లకు పూర్తి ఆధిపత్యం ఉన్న నెవెడాలో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఇక్కడ బైడెన్‌ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో నెవాడాలోని ఎలక్టోరల్‌ ఓట్లు ట్రంప్‌కు రావడం కాస్త కష్టంగానే కన్పిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తోన్న ట్రంప్‌ న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో దావా వేశారు.