Amazon Great Indian Festival: స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2వేల లోపు టాప్ డీల్స్!

ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ అక్టోబర్ 3 నుంచే మొదలైంది. ఈ ఏడాది మెగా సేల్‌లో బిగ్ డీల్స్ తో అమెజాన్ ముందుకొచ్చింది.

Amazon Great Indian Festival: స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2వేల లోపు టాప్ డీల్స్!

Amazon Great Indian Festival Top Deals On Smartwatches Under Rs 2,000

Amazon Great Indian Festival: ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ అక్టోబర్ 3 నుంచే మొదలైంది. ఈ ఏడాది మెగా సేల్‌లో బిగ్ డీల్స్ తో అమెజాన్ ముందుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లు, వేరబుల్ డివైజ్ లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్చేస్తోంది. Latops, Tablets, TVs, Smartwatches సహా పలు గాడ్జెట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎప్పుడూ క్లోజ్ అవుతుందో వెల్లడించలేదు. ఫెస్టివల్ సీజన్ కావడంతో అక్టోబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ప్రత్యేకించి అమెజాన్ HDFC Bank Credit, Debit Card వినియోగదారులకు భారీగా ఆఫర్లను అందిస్తోంది. HDFC Credit కార్డుపై EMI, Non-EMI ట్రాన్సాక్షన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించి పలు వేరబుల్ Smartwatch గాడ్జెట్లను అమెజాన్ మెగా సేల్ లో అందుబాటులోకి తెచ్చింది. Amazon Festival సేల్ సందర్భంగా స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్ నెస్ బ్యాండ్లలో boAt , Noise వంటి గాడ్జెట్లపై రూ.2000 వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది.
Hop Oxo : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. దీని ఫీచర్లకు కుర్రకారు ఫిదా కావాల్సిందే

Noise Colourfit Pro 2:
ఈ స్మార్ట్ వాచ్.. 35g బరువుతో పాటు ఫిల్-టచ్ కంట్రోల్ అందిస్తుంది. LCD డిస్ ప్లే అప్ గ్రేడ్ అయింది. IP68 వాటర్ ప్రూఫ్ కూడా. హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంది. స్లీప్, స్టెప్ ట్రాకర్ అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాల్, మెసేజ్ అలర్ట్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. మెగా సేల్ లో ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1999 నుంచి లభ్యం అవుతోంది.

boAt Xtend smartwatches :
ఈ స్మార్ట్ వాచ్ రూ.2199ల నుంచి అందుబాటులో ఉంది. Alexa Built-in, 1.69 అంగుళాల HD డిస్‌ప్లేతో వచ్చింది. అంతేకాదు.. మల్టీపుల్ వాచ్ ఫేస్, స్ట్రెస్ మానిటర్ (Stress Monitor), హార్ట్, Spo2 మానిటరింగ్, 14 స్పోర్ట్స్ మోడ్స్, స్లీప్ మానిటర్, 5 ATM వాటర్ రిసిస్టెన్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ పిచ్ బ్లాక్ కలర్ ఆప్షన్లతో వచ్చింది.

Noise ColorFit ultra bezel-less smartwatch :
ఈ స్మార్ట్ వాచ్.. (Noise ColorFit Ultra) 1.75 అంగుళాల HD TruView డిస్ ప్లేతో వచ్చింది. 60 స్పోర్ట్స్ మోడ్స్, Spo2, హార్ట్ రేట్, స్ట్రెస్ (Stress), REM, స్లీప్ మానిటర్ (Sleep Monitor) ఫీచర్లతో పాటు కాల్స్, SMS కూడా చేసుకోవచ్చు. Gunmetal Greyలో స్టాక్ మార్కెట్ ఇన్ఫో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర డిస్కౌంట్ ధరతో రూ.2999 లకే సొంతం చేసుకోవచ్చు. ఏదైనా ఇతర ఆఫర్లతో కలిపి కొనుగోలు చేస్తే.. మరింత తక్కువ ధరకే పొందవచ్చు.
Samsung Galaxy M22 : శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే.. ఇండియా సపోర్టు పేజీలో లైవ్!

Fire-Boltt Beast :
ఈ స్మార్ట్ వాచ్ (Fire-Boltt Beast) అతిపెద్ద డిస్ ప్లే ఫుల్ టచ్ స్మార్ట్ వాచ్ గా పేరొంది. Sp02 1.69 మోడ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. స్మార్ట్ వాచ్ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు. మల్టీఫుల్ వాచ్ ఫేస్ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ పొందవచ్చు.

Amazfit GTS2 Mini smartwatch :
ఈ స్మార్ట్ వాచ్.. 1.55 అంగుళాల AMOLED డిస్ ప్లేతో వచ్చింది. Sp02 లెవల్ చెక్ చేసుకోవచ్చు. 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇందులో 70 వరకు మోడ్స్, బుల్ట్-ఇన్ అమెజాన్ Alexa, GPS, HR, స్లీప్, స్ట్రెస్ మానిటర్ చేసుకోవచ్చు. Meteor Black కలర్ ఆప్షన్ తో వచ్చింది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.4వేలు వరకు ఉంది. మీరు ఏదైనా బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Tata Punch మైక్రో SUV కారు వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!