Hop Oxo : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. దీని ఫీచర్లకు కుర్రకారు ఫిదా కావాల్సిందే

త్వరలో మార్కెట్లోకి రానున్న హోప్ ఓఎక్స్ఓ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు వాహన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ బైక్ త్వరలో మార్కెట్లోకి రానుంది.

Hop Oxo : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. దీని ఫీచర్లకు కుర్రకారు ఫిదా కావాల్సిందే

Hop Oxo

Hop Oxo : దేశంలో పెట్రోల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఇక వాయు కాలుష్యం కూడా ఎక్కువైంది. వీటిని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులలో హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒకటి. ఈ హోప్ ఎలక్ట్రిక్ త్వరలో దేశీయ మార్కెట్లో తన టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఓఎక్స్ఓ(OXO).

Read More : Javed Akhtar And RSS : జావెద్ అక్తర్‌పై ఎఫ్ఐఆర్

ఓఎక్స్ఓ(OXO)ను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో తెగ వైరల్ అవూతున్నాయి.ఈ బైక్ డిజైన్, స్టైలింగ్ స్పోర్ట్స్ బైక్ తరహాలో ఉన్నాయి. ఇది ఆల్-ఎల్ఈడి సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. ట్రెండీ వైజర్, స్పియర్ ఆకారంలో టర్న్ ఇండికేటర్లు, స్లీక్ ఎల్ ఈడి డిఆర్ఎల్, సింగిల్ సీట్ డిజైన్, షార్ట్ టెయిల్ సెక్షన్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి.

బైక్ ఏరోడైనమిక్ ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఓఎక్స్ఓ టాప్ స్పీడ్ గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వినియోగాదారులు కోరుకునే అన్ని ఫీచర్స్ ఈ కొత్త Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఫీచర్లు వాహన ప్రియులను ఆకర్షించే అవకాశం ఉంది.

Read More : Raft indus Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్