Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్స్‌పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!

Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ సమయంలో ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ (iPhone 15) సిరీస్‌పై కూడా రూ. 6వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, బడ్జెట్ iPads, MacBooksపై డిస్కౌంట్లను ఇప్పుడు చూద్దాం.

Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్స్‌పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!

Apple Diwali Sale offers Discounts up to Rs 10K on MacBooks, iPads

Apple Diwali Sale Offers : అసలే పండుగ సీజన్.. అనేక స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రొడక్టులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లను (Apple Diwali Sale Offers) ప్రకటించింది. అంతేకాదు.. MacBook Air, 10వ జనరేషన్ iPad, మరిన్నింటిపై రూ. 10వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?

Read Also : Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ ఫోన్లపై టాప్ డీల్స్ మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

అయితే, ఈ పండుగ సీజన్‌లో చాలా తక్కువ ధరక కొనుగోలు చేయవచ్చు. కంపెనీ M2 చిప్‌తో రన్ అయ్యే 13-అంగుళాలు, 15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌లపై ఆపిల్ రూ. 10వేల తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అందుబాటులో ఉంది. అయితే, మ్యాక్‌బుక్ అసలు ధరపై అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ అందించడం లేదు.

అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై ధర తగ్గింపు :

ప్రస్తుతం, ఆపిల్ (MacBook Air M2)ని భారత మార్కెట్లో రూ. 1,14,900కి విక్రయిస్తోంది. అదే ల్యాప్‌టాప్ M1 మోడల్ ఆపిల్ స్టోర్‌లో బేస్ 8GB RAM + 256GB SSD స్టోరేజ్ ధర రూ. 99,900కి అందుబాటులో ఉంది. మరోవైపు అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M1 మోడల్‌ను రూ.69,990 తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై భారీ ఫ్లాట్ తగ్గింపును పొందింది. అదేవిధంగా, M2 మోడల్ మీకు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 94,990 అవుతుంది. కొన్ని అదనపు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Apple Diwali Sale offers Discounts up to Rs 10K on MacBooks, iPads

Apple Diwali Sale offers Discounts

బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :
ఆపిల్ టాబ్లెట్ లైనప్‌పై లేటెస్ట్ డిస్కౌంట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 11-అంగుళాలు, 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో వేరియంట్‌లు, అలాగే ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లు ప్రస్తుతం రూ. 5వేల తగ్గింపు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందిస్తోంది. అదనంగా, 9వ జనరేషన్ ఐప్యాడ్, 5వ జనరేషన్ ఐప్యాడ్ ఇప్పుడు మరింత సరసమైన ధర ట్యాగ్‌తో వస్తాయి. వరుసగా రూ. 3వేలు నుంచి రూ. 4వేలు తగ్గింపులు ఉన్నాయి.

ఐప్యాడ్ మినీ (iPad Mini)ని చూసే దుకాణదారులు పైన పేర్కొన్న బ్యాంక్ కార్డ్‌పై రూ. 3వేల ధర డిస్కౌంట్ కూడా పొందవచ్చు. టాబ్లెట్‌ను అత్యంత తక్కువ ధరకు పొందడానికి వివిధ ఇ-కామర్స్ లేదా ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో డీల్ ధరను చెక్ చేసిన తర్వాత ఐప్యాడ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆపిల్ స్టోర్ స్వయంగా టాబ్లెట్‌ను తక్కువ ధరకు అందిస్తున్నప్పటికీ, కొనుగోలుకు ముందు ప్రతిచోటా డీల్ ధరలను చెక్ చేసుకోవచ్చు.

Read Also : Acer Muvi 125 4G Launch : ల్యాప్‌టాప్ కంపెనీ ఏసర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 80కి.మీ దూసుకెళ్తుంది!