Apple Electric Car 3D Model : ఆపిల్ ఎలక్ట్రిక్ 3D కారు మోడల్ చూశారా? డిజైన్ అదిరిందిగా!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఆపిల్ ఎలక్ట్రిక్ కారు తయారీపై 2014 ఆరంభం నుంచే రుమర్లు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకూ ఆపిల్ ఎలక్ట్రిక్ కార్లపై రివీల్ చేయలేదు.

Apple Electric Car 3D Model : ఆపిల్ ఎలక్ట్రిక్ 3D కారు మోడల్ చూశారా? డిజైన్ అదిరిందిగా!

Apple Electric Car’s 3d Model Gives A Sneak Peek At How It Might Look According To Patents

Apple electric car’s 3D model : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఆపిల్ ఎలక్ట్రిక్ కారు తయారీపై 2014 ఆరంభం నుంచే రుమర్లు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకూ ఆపిల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై రివీల్ చేయలేదు. ఆ వివరాలను మాత్రం ఆపిల్ చాలా సీక్రెట్‌గా ఉంచుతోంది. 9to5Mac రిపోర్టు ప్రకారం.. 2024కు ముందు మార్కెట్లో ఆపిల్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయ్యే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. కానీ, యూకే ఆధారిత వాహన లీజింగ్ కంపెనీ వనరామా (Vanarama) రాబోయే ఆపిల్ కారు ఎలా ఉండనుందో ఓ 3D మోడల్ క్రియేట్ చేసింది.

Apple Electric Car’s 3d Model Gives A Sneak Peek At How It Might Look According To Patents(3)

అచ్చం ఆపిల్ పేటెంట్లను ఉపయోగించి 3D మోడల్ కారును డిజైన్ చేసింది. ఈ 3D మోడల్ ఆపిల్ ఎలక్ట్రిక్ కారు తుది డిజైన్ ఇలానే ఉంటుందంటూ చెబుతోంది. కానీ, రాబోయే కొద్ది ఏళ్లలో ఆపిల్ అతిపెద్ద ఆవిష్కరణలో ఎలక్ట్రిక్ కారు ఒకటిగా ఉండనుంది. వనరామ డిజైన్ చేసిన ఆపిల్ 3D కారు మోడల్ చూస్తే.. బయట నుంచి ఆపిల్ కారు రెండర్ టెస్లా సైబర్ ట్రక్‌ మాదిరి పోలి ఉంది. సైబర్ ట్రక్ కన్నా కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఈ కారు పిల్లర్ లెస్ స్ట్రక్చర్ కలిగి ఉండొచ్చు. పేటెంట్ ప్రకారం.. US10309132B1 విండ్ షీల్డ్, కిటికీలు, సన్ రూఫ్ ఉండొచ్చు.

Apple Electric Car’s 3d Model Gives A Sneak Peek At How It Might Look According To Patents(2)

ఇందులో అడాప్టివ్ డోర్లు, కారు ఫ్రంట్ సైడ్ మాక్ ప్రో మెష్ గ్రిల్ ఉండనుంది. కారు రిట్రాక్టబుల్ డోర్ హ్యాండిల్స్ ఐఫోన్ సైడ్ బటన్లను పోలి ఉంటాయి. వాస్తవానికి ఏ పేటెంట్ ఆధారంగా లేనప్పటికీ.. వనరామా కారు ఎలక్ట్రిక్ మోడల్ స్టయిలీష్‌గా కనిపించేలా డిజైన్ చేసింది. iPhone 4 (frosted white finish) ఫ్రోస్టెడ్ వైట్ ఫినిష్ కోటింగ్ ఇచ్చింది. ఇక కారు లోపల మ్యాక్ ఆటోమేటెడ్ అసిస్టెంట్, Siri (పేటెంట్ ప్రకారం.. JP2020173835A) ఉంది. స్టీరింగ్ వీల్, కస్టమైజబుల్ డ్యాష్ బోర్డు, ఇందులోని డ్రైవర్స్ ద్వారా కారులో ఎయిర్ కండీషనింగ్, సౌండ్ సిస్టమ్ సహా ఇంటిరియర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు.

Apple Electric Car’s 3d Model Gives A Sneak Peek At How It Might Look According To Patents(1)

ఆపిల్ నుంచి ఇప్పట్లో ఈ ఎలక్ట్రిక్ మోడల్ కారు తయారీపై అధికారికంగా ప్రకటన వచ్చేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఆపిల్ ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంటుందో ముందే ఊహించుకునేందుకు వనరామ డిజైన్ చేసిన ఈ 3D మోడల్ కారు చూస్తే చాలు.. ఆపిల్ ఎలక్ట్రిక్ కారుపై ఎప్పుడు ప్రకటన చేస్తుందో వేచి చూడక తప్పదు..
Read Also : Samsung Cleaning Cloth : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ ఫన్ ప్రమోషన్ ఆఫర్..!