Apple Fans : ఢిల్లీ స్టోర్‌లో ఆపిల్ సీఈఓ సందడి.. టిమ్ కుక్ కాళ్లు మొక్కి మరి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిన అభిమానులు..!

Apple Fans : ఆపిల్ ఢిల్లీ స్టోర్‌లో కస్టమర్లు, టెక్ ఔత్సాహికులు, అభిమానులతో సందడిగా మారింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్ ( Apple Delhi Store) ఓపెనింగ్ వీక్షించేందుకు వందల సంఖ్యలో ఆపిల్ అభిమానులు బారులు తీరారు.

Apple Fans : ఢిల్లీ స్టోర్‌లో ఆపిల్ సీఈఓ సందడి.. టిమ్ కుక్ కాళ్లు మొక్కి మరి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిన అభిమానులు..!

Apple fans touch CEO Tim Cook's feet at Delhi store, line up to get his autograph

Apple Fans : భారత మార్కెట్లోకి ఆపిల్ రెండు రిటైల్ స్టోర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏప్రిల్ 20 (గురువారం) ఢిల్లీలోని సాకేత్‌లో సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఆపిల్ రెండో రిటైల్ స్టోర్‌ ప్రారంభమైంది. ఈ స్టోర్‌ను ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ (Tim Cook) గేట్ ఓపెన్ చేసి కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఆపిల్ సీఈఓను చూసేందుకు వందలాది మంది ఆపిల్ అభిమానులు (Apple Fans) కొత్త Apple Store వెలుపల బారులు తీరారు. కొందరు అభిమానులు ఆపిల్ స్టోర్‌లోకి వెళ్లేటప్పుడు టిమ్ కుక్ పాదాలను కూడా తాకి మరి ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారు.

ఏప్రిల్ 18న ఆపిల్ ముంబై BKC స్టోర్ ప్రారంభించగా.. ఆ తర్వాత భారత్‌లో ఆపిల్ రెండవ స్టోర్ ఇది మాత్రమే. ఈ క్రమంలోనే ఆపిల్ స్టోర్ల ఓపెనింగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఆపిల్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఢిల్లీలో అయితే ఆపిల్ అభిమానులు ఉదయం 7:30 గంటలకే స్టోర్ వెలుపల బారులు తీరారు. మాల్ వెలుపలికి భారీగా క్యూలో వేచి ఉన్నారు. సీఈఓ కుక్ రాగానే ఆపిల్ అభిమానులంతా ఆయన చుట్టు నిలబడ్డారు. మాల్ లోపల చాలా మంది అభిమానులు తమ పాత ఆపిల్ ప్రొడక్టులను తీసుకొచ్చి మరి ఆపిల్ బాస్ చేత ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు.

Read Also : Apple Delhi Store : ఆపిల్ రెండో స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ముందు భారీగా క్యూ కట్టిన కస్టమర్లు..!

టిమ్ కుక్ ఎట్టకేలకు ఉదయం 10 గంటలకు ఢిల్లీ స్టోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్లిన మొదటి ఆపిల్ కస్టమర్లను కలుసుకున్నారు. ఆపిల్ అభిమానులను కుక్ ఆత్మీయంగా నమస్తే అని పలకరిస్తూ స్టోర్ లోపలికి స్వాగతం పలికారు. అభిమానులతో కుక్ కరచాలనం చేశారు. అయితే, ఆపిల్ అభిమానుల్లో చాలామంది దగ్గరకు వచ్చి కుక్ కాళ్లు మొక్కారు. అందరిని పలకరిస్తూ ఎంతో ఉత్సాహంగా కుక్ కనిపించారు. ఆపిల్ కస్టమర్లను స్వయంగా ఆయనే వెళ్లి పలకరించారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కస్టమర్ల ఆపిల్ ప్రొడక్టులపై టిమ్ కుక్ ఆటోగ్రాఫ్ కూడా చేశారు.

Apple fans touch CEO Tim Cook's feet at Delhi store, line up to get his autograph

Apple fans touch CEO Tim Cook’s feet at Delhi store, line up to get his autograph

ఢిల్లీ స్టోర్ లక్కీ కస్టమర్ ఏం తెచ్చాడంటే? :
ఆపిల్ లక్కీ ఫ్యాన్ ఒకరు.. ఐఫోన్ 4s (iPhone 4s) స్పేర్ పార్టులను తనతో పాటు స్టోర్‌కు తీసుకొచ్చాడు. Apple CEOగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లాంచ్ అయిన మొదటి ఐఫోన్ అదే.. ఇప్పటివరకూ కొంచెం కూడా చెక్కుచెదరకుండా పాత ఐఫోన్ అలానే ఉంది. అది కుక్ చూడగానే ఆశ్చర్యపోయాడు. ఐఫోన్‌పై కుక్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఢిల్లీకి చెందిన మరో వృద్ధ దంపతులు తమ టోట్ బ్యాగులపై కుక్‌ను అడిగి మరి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

జోధ్‌పూర్‌కు చెందిన మాధవ్ గత వారం రోజులుగా ఆపిల్ సీఈఓ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నాడట.. ఫస్ట్ ముంబై స్టోర్‌కి వెళ్లి లోపలికి ప్రవేశించిన వారిలో ఒకడు కూడా. ఇప్పుడు ఢిల్లీలోని సాకేత్ స్టోర్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముంబై స్టోర్‌లో ఒక వ్యక్తి తన 10 ఏళ్ల ఐపాడ్‌ను టిమ్ కుక్ చేత సంతకం చేయించుకోగా.. మరొకరు 1984 Macintosh SE అనే పాత ఆపిల్ కంప్యూటర్ తీసుకువచ్చి మరి కుక్‌కు చూపించాడు. అది చూసిన ఆపిల్ సీఈఓ ఆశ్చర్యపోయారు.

ఆపిల్ ఢిల్లీ స్టోర్ ముంబై స్టోర్ కన్నా చిన్నదిగా ఉంటుంది. కానీ, వినియోగదారులకు అన్ని సర్వీసులను అందిస్తుంది. భారత్‌లో 18 రాష్ట్రాల నుంచి 70 మంది సభ్యులతో ఆపిల్ సిబ్బందిని నియమించింది. వీరంతా సమిష్టిగా దాదాపు 15 భాషలను మాట్లాడగలరు. ఈ స్టోర్‌లో కంపెనీ అనేక ప్రొడక్టులు, అప్లియన్సెస్ ప్రదర్శించే వైట్ ఓక్ టేబుల్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన కర్వడ్ స్టోర్ ఫ్రంట్ ఉంది. iPhone, MacBook, Apple appliances, Apple Music, Apple ఆర్కేడ్, Apple TV వంటి ప్రొడక్టులకు ప్రత్యేక సెక్షన్లు కూడా ఉన్నాయి.

Read Also : Apple Store in Delhi : ఆపిల్ రెండో స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ స్టోర్ స్పెషాలిటీ ఇదే..!