iPhone 15 Models : ఐఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఈ తేదీన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. ఏకంగా 5 మోడల్స్.. ధర ఎంత, ఫీచర్లు ఇవేనా?

iPhone 15 Models : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్ వచ్చేస్తోంది. ఈ తేదీన ఐఫోన్ 15 మొత్తం 5 మోడల్స్ లాంచ్ చేయనుంది. ధర, ఫీచర్లకు సంబంధించి నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

iPhone 15 Models : ఐఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఈ తేదీన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. ఏకంగా 5 మోడల్స్.. ధర ఎంత, ఫీచర్లు ఇవేనా?

Apple reportedly releasing five iPhone 15 models, including Pro Max and Ultra

iPhone 15 Models : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మరో వారం వరకు ఆగండి.. ఈ నెల (సెప్టెంబర్)లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మొత్తం 5 మోడళ్లలో లాంచ్ కానుంది. అందిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న రాత్రి 10:30 గంటలకు లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. కాలిఫోర్నియాలో ఆపిల్ హెడ్ క్వార్టర్స్‌లో వండర్ లస్ట్ పేరుతో ఈవెంట్ నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. గత ఐఫోన్ సిరీస్‌‌లు మాదిరిగానే 4 మోడల్స్ రిలీజ్ చేస్తుందని కొన్ని నివేదికలు చెబుతుంటే.. లేటెస్ట్ రిపోర్టులను పరిశీలిస్తే.. ఐఫోన్ 15 సిరీస్‌ మొత్తం 5 మోడల్స్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

ఐఫోన్ 15 సిరీస్ :
ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ లాంచ్ కావాలి. కానీ, ఈ ఏడాది అదనంగా ఐఫోన్ అల్ట్రా మోడల్ కూడా రావచ్చు. ఈ మోడల్ ఐఫోన్ 15 ప్రో వంటి సరికొత్త ఫీచర్లతో రానుందని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఐఫోన్ 15 అల్ట్రా :
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6GB RAM, 1TB స్టోరేజీతో రావచ్చు. ఐఫోన్ 15 అల్ట్రా మోడల్ 2023 లాంచ్ కావచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. 8GB RAM, 2TB స్టోరేజీతో రానుంది. ఐఫోన్ 15 అల్ట్రా మోడల్, ప్రో మోడల్ కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో రానుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ కన్నా అల్ట్రా మోడల్ అత్యంత ఖరీదైన మోడల్ అని చెప్పవచ్చు. ఈ ఐఫోన్ ధర ప్రో మాక్స్ మోడల్ కన్నా దాదాపు 100 డాలర్లు ఎక్కువగా ఉండవచ్చు.

Apple reportedly releasing five iPhone 15 models, including Pro Max and Ultra

Apple reportedly releasing five iPhone 15 models, including Pro Max and Ultra

ఐఫోన్ 15 సిరీస్ ధర (అంచనా) :
గత ఏడాది మాదిరిగానే ఐఫోన్ 15 ప్రో మాక్స్.. ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్ కన్నా ఖరీదైనదిగా ఉండవచ్చు. గతేడాదిలో ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ ధర 1,099 డాలర్లుగా ఉంది. ఇప్పుడు, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ ధర 1,299 డాలర్లుగా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ ధర రూ. 1,59,900 ఉండవచ్చు.

భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఐఫోన్ 15 అల్ట్రా మోడల్‌ను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ ధర డాలర్‌కు రూ.100 పెరిగితే.. ఐఫోన్ ప్రో మాక్స్ కన్నా రూ. 8 వేలు ఎక్కువగా ఉండవచ్చు. ఆపిల్ కొత్త అల్ట్రా మోడల్ ధర రూ.1,67,900 వరకు పెరగవచ్చు. అయితే, ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ. 1,39,900 వరకు ఉండొచ్చు.

Read Also : Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!