Apple Scary Fast Event : అక్టోబర్ 31నే ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. ఏయే ప్రొడక్టులు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Apple Scary Fast Event : ఆపిల్ ఈ ఏడాది చివరి ఈవెంట్ స్కేరీ ఫాస్ట్‌ను అక్టోబర్ 31న భారత్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈవెంట్ లైవ్ (How to watch Livestream) స్ట్రీమింగ్ ఎలా చూడవచ్చు? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Apple Scary Fast Event : అక్టోబర్ 31నే ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. ఏయే ప్రొడక్టులు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Apple Scary Fast event on October 31_ How to watch livestream, Check Details in Telugu

Updated On : October 30, 2023 / 4:20 PM IST

Apple Scary Fast Event : గత సెప్టెంబర్‌లో జరిగిన ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను ప్రకటించిన తర్వాత, ఆపిల్ మరో లాంచ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ను రెండు రోజుల క్రితమే ధృవీకరించింది. (M3) చిప్‌తో కూడిన ఈవెంట్ సందర్భంగా ఆపిల్ కొత్త (Macbooks, iMac)లను పరిచయం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Apple iPhone 13 Price Drop : అమెజాన్ దీపావళి సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

జనవరి 2023లో లాంచ్ అయిన ఆపిల్ మునుపటి M2 ప్రో, M2 మాక్స్ చిప్‌ల కంటే M3 చిప్ వేగంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ కొత్త మ్యాక్స్ సన్నగా ఉండే బెజెల్‌లు, ప్రకాశవంతమైన డిస్‌ప్లేలు మెరుగైన కెమెరాలతో కలిగి ఉంటాయని భావిస్తున్నారు. భారతీయ యూజర్ల కోసం, స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ అక్టోబర్ 31 ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు (Apple Scary Fast Event) ఈవెంట్‌ను ఎలా లైవ్‌లో చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ : లైవ్ స్ట్రీమింగ్ ఇలా :

ఇప్పటికే చెప్పినట్లుగా.. ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ అక్టోబర్ 30న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే.. భారతీయులకు అక్టోబర్ 31న ఉదయం 5:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. మీరు ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ వివిధ ఛానెల్‌ల ద్వారా చూడవచ్చు. ఆపిల్ (Apple.com) అధికారిక వెబ్‌సైట్, YouTube, Apple TV యాప్, Apple ఈవెంట్‌ల పేజీలో కూడా వీక్షించవచ్చు.

ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ : ఏమి ఉండవచ్చు? :

ఈ ఆపిల్ ఈవెంట్‌లో కొత్త మ్యాక్‌బుక్స్, ఐమ్యాక్‌లు లాంచ్ కానున్నాయి. ఈ డివైజ్‌లు నెక్స్ట్ జనరేషన్ (M3) చిప్ ద్వారా పవర్ అందిస్తాయని నివేదికలు చెబుతున్నాయి. M2 Pro, M2 max చిప్‌ల కంటే శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. ఎం3 చిప్‌తో కూడిన 24-అంగుళాల iMac, ఎం3 చిప్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, ఎం3 చిప్‌తో 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో లాంచ్ చేయనుంది. 24-అంగుళాల ఐమ్యాక్స్ వస్తున్నట్లయితే.. కొత్త ప్రాసెసర్, కలర్ రేంజ్‌తో 2021లో ఆపిల్ ప్రారంభించిన ఐమ్యాక్ రిఫ్రెష్ అవుతుంది.

Apple Scary Fast event on October 31_ How to watch livestream, Check Details in Telugu

Apple Scary Fast event on October 31

ఐమ్యాక్ ఒక అద్భుతమైన డిజైన్, 4.5K రెటీనా డిస్‌ప్లే, టచ్ IDతో కూడిన మ్యాజిక్ కీబోర్డ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎం3 చిప్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో కొత్త ప్రాసెసర్, మినీ-LED డిస్‌ప్లేతో జనవరి 2023లో ఆపిల్ ప్రారంభించిన మ్యాక్‌బుక్ ప్రోకి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ డివైజ్ ఫ్లాట్-ఎడ్జ్డ్ డిజైన్, మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ పోర్ట్, HDMI పోర్ట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎం3 చిప్‌తో కూడిన 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో కొత్త ప్రాసెసర్, మినీ-ఎల్ఈడీ డిస్‌ప్లేతో పెద్ద మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌కు అదే విధమైన అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు.

మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) 14-అంగుళాల మోడల్‌లో ఉన్న అదే ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, మరిన్ని ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లతో ఉంటుంది. ఈ కొత్త మ్యాక్స్‌తో పాటు, ఆపిల్ (USB-C) మ్యాజిక్ కీబోర్డ్, ఫోర్స్ టచ్‌తో కూడిన మ్యాజిక్ మౌస్, (AirPods Pro 2) వంటి కొన్ని కొత్త అప్లియన్సెస్ కూడా ఈవెంట్‌లో ప్రకటించవచ్చు. అయితే, కంపెనీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని గమనించాలి.

Read Also : Apple Scary Fast Event : ఈ నెల 30నే ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో, ఐమ్యాక్ లాంచ్..!