డబ్బులు డ్రా చేస్తున్నారా : ATM విత్ డ్రా ఛార్జీలు పెరుగుతాయా

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 04:53 PM IST
డబ్బులు డ్రా చేస్తున్నారా : ATM విత్ డ్రా ఛార్జీలు పెరుగుతాయా

మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ..భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)కు లేఖ రాసింది. దీనికి కేంద్రం సానుకూలంగానే స్పందించనున్నట్లు సమాచారం. 

ఐదుసార్లు డ్రా చేసిన అనంతరం ప్రతి లావాదేవీకి రూ. 15 చొప్పున వినియోగదారుడికి విధించే వారు. నగదు రహిత ట్రాన్స్క్షన్‌ల రూ. 5 చొప్పున ఛార్జీలున్నాయి. అయితే..ATMల భద్రత, నిర్వాహణ ప్రమాణాలను ఆర్బీఐ పెంచిన క్రమంలో తమకు ఖర్చు అదనంగా పెరిగిపోయిందని, దీనివల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్ల సంఘం వెల్లడించింది.

జనాభా 1 మిలియన్ కంటే..ఎక్కువ ఉన్న పట్టణ ప్రాంతాలకు నగదు లావాదేవీలపై రూ. 17, ఆర్థికేతర లావాదేవీలపై రూ. 7 ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని సిఫార్సు చేసింది. ఉచిత ఏటీఎంలను మూడింటికి మాత్రమే పరిమితం చేయాలని కోరింది.

జనాభ 1 మిలియన్ కంటే తక్కువ ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు, నగదు లావాదేవీలపై రూ. 18, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 8 ఇంటర్ ఛేంజ్ ఫీజును కమిటీ సిఫార్సు చేసింది. ఇకడ ఉచిత ఎటీఎం లావాదేవీలను ఆరింటికి పరిమితం చేయాలని సూచించింది.

దేశంలో ఏటీఎంలను పెంచే..మార్గాలను సిఫార్సు చేయడానికి 2019లో RBI ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యుల కమిటీ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఆపరేటర్ల సంఘం చేసిన ప్రతిపాదలను కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సిఫార్సులకు ఒకే చెబితే..వినియోగదారులకు అదనపు భారం పడనుంది. 

ఆర్బీఐ డేటా ప్రకారం దేశ వ్యాప్తంగా 2, 27, 000 ఏటీఎంలున్నాయి. వాటిలో 21 వేల 300 వైట్ లేబుల్ యంత్రాలు, మిగిలినవి సొంతంగా బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నవి ఉన్నాయి.