బ్యాంకులకు వచ్చే 3నెలల్లో 30రోజుల సెలవు

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 09:08 AM IST
బ్యాంకులకు వచ్చే 3నెలల్లో 30రోజుల సెలవు

వచ్చే 3నెలల్లో 30రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. లాక్‌డౌన్‌లో కూడా పనిచేసి వినియోగదారులకు సేవలందించిన బ్యాంకులకు రాబోయే 3నెలల్లో 30రోజుల సెలవులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం… జూన్, జులై, ఆగస్టులో శని, ఆదివారాలతో పాటు పండగలు కలుపుకుంటే దాదాపు 30 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుంటే.. దానికి అనుగణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు. మరి జూన్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకులకు సెలవులు ఎప్పుడో ఇక్కడ చూడండి.

జూన్-ఆగస్టు మధ్యలో 30రోజుల సెలవులు 
జూన్ నెలలో… శని, ఆదివారాల కారణంగా జూన్- 7, 13, 14, 17, 23, 24, 31తారీఖుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటితో పాటు జూన్ 18న గురు హర్ గోబింద్ జీ జయంతి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జులై నెలలో… శని ఆదివారాల కారణంగా జులై-5, 11, 12, 19, 25, 26తారీఖుల్లో బ్యాంకులకు సెలవు. వీటితో పాటు జులై 31న బక్రీద్ సందర్భంగా మరో సెలవు వచ్చింది.

ఆగస్టు నెలలో… శని ఆదివారాల కారణంగా ఆగస్ట్-2, 8, 9, 16, 22, 23, 29, 30 తారీఖుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటితో పాటు ఆగస్టు 3న రాఖీ పండుగ లేదా రక్షాబంధన్, 11న శ్రీ క్రిష్ణ జన్మాష్టమి స్థానిక సెలవు, 12న శ్రీ కృష్ణ జన్మాష్టమి గెజిటెడ్ హాలీడే, 15 ఇండిపెండెన్స్ డే, 21న తీజ్ లోకల్ హాలిడే, 22న వినాయక చవితి, 30న మొహర్రం గెజిటెడ్ హాలీడే, ఆగస్టు 31న ఓనమ్ లోకల్ హాలీడే ఉంటుంది.

Read: భారత్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్