Amazon Prime Day : అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్’ ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఇవే!

ప్రైమ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 26,27 తేదీల్లో 'ప్రైమ్‌ డే' సేల్‌ నిర్వహించింది. ఈ సేల్ లో ప్రైమ్ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అమెజాన్లో డెస్క్‌ట్యాప్‌, ల్యాప్‌ ట్యాప్‌, బ్యూటీ ప్రాడక్ట్‌, దుస్తులు, ఇంట‍్లో ఉపయోగించే సామాగ్రి, స్మార్ట్‌ ఫోన్లతో పాటు వంటగదిలో వినియోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్‌ తెలిపింది.

Amazon Prime Day : అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్’ ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఇవే!

Amazon Prime Day

Amazon Prime Day : ప్రైమ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 26,27 తేదీల్లో ‘ప్రైమ్‌ డే’ సేల్‌ నిర్వహించింది. ఈ సేల్ లో ప్రైమ్ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అమెజాన్లో డెస్క్‌ట్యాప్‌, ల్యాప్‌ ట్యాప్‌, బ్యూటీ ప్రాడక్ట్‌, దుస్తులు, ఇంట‍్లో ఉపయోగించే సామాగ్రి, స్మార్ట్‌ ఫోన్లతో పాటు వంటగదిలో వినియోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్‌ తెలిపింది. 48 గంటలపాటు జరిగిన ఈ సేల్ లో 1.26లక్షల మంది కొనుగోళ్లు జరిపారు. 31,000 మంది అమ్మకాలు చేశారు.. ఆ అమ్మకాల్లో 25 శాతం మంది రూ.1కోటి పైగా బిజినెస్‌ నిర్వహించినట్లు అమెజాన్‌ ప్రతినిధులు తెలిపారు.

10 నగరాల నుంచి కొత్త కోస్టమర్లు

ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ లో 70 శాతం మంది కొత్త ప్రైమ్ మెంబర్స్ షాపింగ్ చేసినట్లు చెప్పింది అమెజాన్. ప్రధానంగా దేశంలోని 10 నగరాల నుంచి ఎక్కువమంది ప్రైమ్ మెంబర్స్ షాపింగ్ చేశారని తెలిపింది.. ఆ నగరాల వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్‌ కు చెందిన అనంతనాగ్‌,జార్ఖండ్ లోని బొకారో, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌, నాగలాండ్‌ లోని మొకోక్చుంగ్, పంజాబ్‌లోని హోషియార్‌పూర్, తమిళనాడులో నీలగిరి, కర్ణాటకలోని గడగ్, కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది అమెజాన్.

అధికంగా అమ్ముడైన ఫోన్లు ఇవే

ఈ సేల్లో సెల్ ఫోన్స్ అత్యధికంగా అమ్ముడయ్యాని పేర్కొంది. వన్‌ ప్లస్‌ నార్డ్‌2 5జీ, వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ, రెడ్‌ మీ నోట్‌ 10 సిరీస్‌, రెడ్‌మీ 9, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 31ఎస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎం21, రియల్‌మీ సీ11 ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అమెజాన్‌ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇక స్మార్ట్ టీవీల కొనుగోళ్లు కూడా అధికంగా జరిగాయని తెలిపారు.