Best Smartphones in India : అక్టోబర్ 2023లో రూ. 35వేల లోపు ధరకే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best smartphones in India : ఈ అక్టోబర్‌లో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో (Poco F5 5G) సహా మరో 2 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

Best Smartphones in India : అక్టోబర్ 2023లో రూ. 35వేల లోపు ధరకే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best smartphones in India : కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే మీకు సరైన అవకాశం.. రూ. 35వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్‌లు, బ్యాటరీతో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)తో, కొన్ని ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌లు కూడా రూ. 35వేల లోపు రిటైల్ ధరలో అందుబాటులో ఉన్నాయి. భారత్ మార్కెట్లో రూ. 35వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్‌లు (Best smartphones in India) ఉన్నాయి. ఈ జాబితాలో Poco F5 5G, iQOO Neo 7 Pro 5G, Motorola Edge 40 5G ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

1. Poco F5 5G :
పోకో F5 5G ఫోన్ దాదాపు రూ. 30వేల ధరలో ఆకట్టుకునే ఫోన్. రాబోయే సేల్ సమయంలో ఈ పోకో ఫోన్ 8GB + 256GB వేరియంట్‌కు కేవలం రూ. 21,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సరసమైన ధర వద్ద టాప్ రేంజ్ ఫీచర్లను అందిస్తోంది. వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best smartphones to buy in India

గేమ్‌లు, మల్టీ టాస్కింగ్, రోజువారీ పనుల్లో చాలా వేగంగా పనిచేస్తుంది. స్క్రీన్ 120Hz AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. Poco F5 5Gలో కెమెరా లైటింగ్‌తో సంబంధం లేకుండా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అదనంగా, బ్యాటరీ చాలా కాలం పాటు ఉంటుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. స్టైలిష్ లుక్, ఫీచర్ల లోడ్‌తో పోకో F5 5G హై-పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న ఎవరికైనా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Best Smartphones in India : కొత్త ఫోన్ కావాలా? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

2. iQOO Neo 7 Pro 5G :
పోకో F5 5G ఫోన్ సహా మరో ఫోన్ ఐక్యూ నియో 7 ప్రో 5G మోడల్.. ఇది కేవలం రూ. 35వేల నుంచి ప్రారంభమవుతుంది. శక్తివంతమైన Snapdragon 8+ Gen 1 SoC కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. బ్యాటరీ 5,000mAh వద్ద చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. మీ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించవచ్చు.

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best smartphones in India October 2023 Telugu

అవసరమైనప్పుడు ఫోన్ వేగంగా ఛార్జ్ చేయవచ్చు. కెమెరా ఫీచర్లతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.. ఐక్యూ నియో 7 ప్రో 5G కచ్చితంగా ఖరీదైనది కాదు. మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే.. బ్యాంక్‌ ఆఫర్లతో పనిలేకుండా ఆకర్షణీయమైన ఫీచర్‌లతో ఐక్యూ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

3. Motorola Edge 40 5G :
మోటోరోలా ఎడ్జ్ 40 5G ఫోన్ అనేది కేవలం రూ. 29,999 వద్ద లభించే అద్భుతమైన ఫోన్. 8GB RAM, 256GB స్టోరేజీతో వెర్షన్‌లో మాత్రమే వస్తుంది. వేర్వేరు ఆప్షన్ల మధ్య నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. మోటరోలా ఎడ్జ్ 40 అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. హై క్వాలిటీ గ్లాస్ మెటల్‌తో రూపొందించింది. IP68 రేటింగ్‌ కలిగి ఉంది.

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best smartphones in October 2023

15W వద్ద వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయగలదు. 4K వీడియోలను రికార్డ్ చేయగలదు. మొత్తం మీద, క్లీన్, యూజర్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. హై-పర్పార్మెన్స్ అందించే ఫోన్‌ను వాడుతుంటే.. మోటోరోలా ఎడ్జ్ 40 5G కచ్చితంగా టాప్ ఆప్షన్లలో ఒకటిగా ఉంటుంది.

4. OnePlus 11R :
ఈ జాబితాలో వన్‌ప్లస్ 11R ఫోన్ ఒకటి.. సాధారణంగా రూ. 39,999 ప్రారంభ ధర వద్ద రిటైల్ అవుతుంది. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Festival Sale)లో, డిస్కౌంట్లు, SBI కార్డ్ ఆఫర్‌లతో ప్రారంభ ధర రూ. 34,999గా వెల్లడించింది. మీరు వేగంగా త్వరగా ఛార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తుంటే.. (OnePlus 11R) బెస్ట్ ఆప్షన్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌తో పనిచేస్తుంది. భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best smartphones to buy in India under Rs 35,000

100W ఛార్జింగ్ సపోర్టుతో చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. వన్‌ప్లస్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుంది. మీరు విడిగా ఛార్జర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అదనంగా, స్క్రీన్ కర్వడ్ పవర్‌ఫుల్ ఫోన్ స్లిమ్‌, స్టైలిష్‌గా కనిపిస్తుంది. వాస్తవానికి, ఫ్లాగ్‌షిప్, వన్‌ప్లస్ 11 మాదిరిగానే కనిపిస్తుంది. క్వాలిటీ సౌండ్ కోసం 2 స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. లేటెస్ట్ Android 13లో రన్ అవుతుంది. మీరు స్క్రీన్‌పై మీ ఫింగర్ ఫ్రింట్‌తో అన్‌లాక్ చేయవచ్చు. వన్‌ప్లస్ 11R క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది.

5. Nothing Phone (2) :
నథింగ్ ఫోన్ (2) కొనాలంటే.. ఇందులో ప్రత్యేకమైన డిజైన్, అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా, నథింగ్ ఫోన్ (2) ఫోన్ ప్రారంభ ధర రూ. 44,999, టాప్-టైర్ 12GB + 512GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 54,999 వరకు ఉంటుంది.

Best smartphones to buy in India under Rs 35,000 in October 2023 Telugu

Best 5 smartphones buy in India Sale Offers

అయితే, రాబోయే సేల్‌లో, నథింగ్ ఫోన్ (2) మోడల్ 8GB + 128GB, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లకు వరుసగా రూ.32,999, రూ.37,999, రూ.42,999కి కొనుగోలు చేయొచ్చునని నథింగ్ వెల్లడించింది. ఇందులో, తగ్గింపు ఆఫర్‌లు, కార్డ్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లతో సహా, నథింగ్ ఫోన్ (2) లాంచ్ ధరపై రూ. 12వేలు తగ్గింపును పొందవచ్చు.

Read Also : Best Smartphones October 2023 : అక్టోబర్‌లో రూ. 15వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!