BMW X3 New Price : రెండు కొత్త డీజిల్ వేరియంట్లతో BMW X3 కారు వచ్చేసింది.. కొత్త మోడల్ ధర ఎంతో తెలుసా?

BMW X3 New Price : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ (BMW) నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. బీఎండబ్ల్యూ (BMW India) నుంచి రెండు కొత్త డీజిల్ వేరియంట్‌లో వచ్చింది.

BMW X3 New Price : రెండు కొత్త డీజిల్ వేరియంట్లతో BMW X3 కారు వచ్చేసింది.. కొత్త మోడల్ ధర ఎంతో తెలుసా?

BMW X3 gets two new diesel variants, check out prices here

BMW X3 New Price : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ (BMW) నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. బీఎండబ్ల్యూ (BMW India) నుంచి BMW X3 మోడల్ కారు రెండు కొత్త డీజిల్ వేరియంట్‌లో వచ్చింది. ఈ X3 మోడల్ కారు.. xDrive20d xLine, X3 xDrive20d M Sport అనే రెండు వేరియంట్‌లతో స్థానికంగా ఉత్పత్తి అయింది. అంతేకాదు.. BMW కారు డీలర్‌షిప్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

BMW X3 xDrive20d xLine మోడల్ ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటే.. BMW X3 xDrive20d M స్పోర్ట్ రూ. 69.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. BMW X3 ప్రీమియం మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Read Also : Elon Musk: ఒబామాను దాటేసిండు..! ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్

అయితే, ఇప్పుడు xLine, M స్పోర్ట్ ట్రిమ్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ (BMW X3) డీజిల్ మోడల్‌లు బలమైన యుటిలిటీ వాహనంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాటు సామర్థ్యాన్ని అందిస్తాయని ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ (Vikram Pawah) చెప్పారు.

BMW X3 gets two new diesel variants, check out prices here

BMW X3 New Price : BMW X3 gets two new diesel variants, check out prices here

BMW గ్రూప్ ఇండియా.. వినూత్న టెక్నాలజీతో పాటు ఇంటీరియర్‌ల సున్నితమైన అనుభూతిని అందిస్తోంది. BMW X3 మోడల్ కారు వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా ఉండనుందని ఆయన తెలిపారు. BMW X3 మోడల్.. BMW ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో 2-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 190hp పవర్, 400Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. దీని ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. BMW X3 డీజిల్ 7.9 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు వేగంగా దూసుకెళ్లగలదు. గరిష్టంగా 213kmph వేగాన్ని అందుకోగలదు.

Read Also : Vodafone-Idea 5G : వోడాఫోన్ ఐడియా 5G సపోర్టు చేసే షావోమీ ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. భారత్‌లో Vi 5G లాంచ్ ఎప్పుడంటే?