boAt Wave Flex Watch : రూ. 1500 లోపు ధరకే బోట్ వేవ్ ఫ్లెక్స్ స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 10రోజుల బ్యాటరీ లైఫ్ కూడా..!

boAt Wave Flex Watch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ (boAt) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అత్యంత సరసమైన ధరకే బోట్ వేవ్ ఫ్లెక్స్ (boAt Wave Flex Watch) స్మార్ట్‌వాచ్ ఆఫర్ చేస్తోంది.

boAt Wave Flex Watch : రూ. 1500 లోపు ధరకే బోట్ వేవ్ ఫ్లెక్స్ స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 10రోజుల బ్యాటరీ లైఫ్ కూడా..!

boAt Wave Flex Smartwatch with bluetooth calling feature launched under Rs 1500 in India

Updated On : March 4, 2023 / 4:56 PM IST

boAt Wave Flex Watch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ (boAt) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అత్యంత సరసమైన ధరకే బోట్ వేవ్ ఫ్లెక్స్ (boAt Wave Flex Watch) స్మార్ట్‌వాచ్ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త బోట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అంతేకాదు.. గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందించే పెద్ద డిస్‌ప్లే కలిగి ఉంది.

బోట్ వేవ్ ఫ్లెక్స్ ధర ఎంతంటే? :
boAt Wave Flex కనెక్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ మూడు (Active Black, Cherry Blossom, Deep Blue) క్లాసీ రంగులలో లభిస్తుంది. ఈ వాచ్ ధర కేవలం రూ. 1,499కే అందుబాటులో ఉంది. మీరు boAt-lifestyle.com, Flipkart నుంచి బోట్ వేవ్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయవచ్చు. రోజువారీ వినియోగానికి ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.

Read Also : NoiseFit Halo Smartwatch : 150కిపైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లతో నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్, కేవలం రూ. 3,999 మాత్రమే..!

బోట్ వేవ్ ఫ్లెక్స్ స్పెసిఫికేషన్స్ ఇవే :
బోట్ వేవ్ ఫ్లెక్స్ పెద్ద 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. క్రిస్టల్-క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. నోటిఫికేషన్‌లు, యాప్‌లను యాక్సెస్ చేయొచ్చు. క్లాసీ మెటాలిక్ డిజైన్, సిలికాన్ బెల్ట్‌తో వస్తుంది. అంతేకాదు.. స్మార్ట్‌వాచ్ కలర్లలో వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ అనేది ఫ్యాషన్, ఫంక్షన్‌లకు చాలా అట్రాక్టివ్‌‌గా ఉంటుంది.

boAt Wave Flex Smartwatch with bluetooth calling feature launched under Rs 1500 in India

boAt Wave Flex Smartwatch with bluetooth calling feature launched under Rs 1500 in India

బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ మిమ్మల్ని 24 గంటలూ కనెక్ట్ అయి ఉండేందుకు అనుమతిస్తుంది. ఆన్‌బోర్డ్ హై-డెఫినిషన్ స్పీకర్, మైక్రోఫోన్‌తో మీరు BT కాలింగ్ ద్వారా కాల్స్ చేయొచ్చు. మీరూ కూడా డివైజ్ కనెక్ట్ చేయవచ్చు. వాచ్‌లో గరిష్టంగా 10 ఇష్టమైన కాంటాక్టులను కూడా సేవ్ చేయొచ్చు.

మీరు అనేక స్పోర్ట్స్ మోడ్‌లు, కచ్చితమైన సెన్సార్‌లతో యాక్టివ్‌గా ఉండవచ్చు. మీ ఫిట్‌నెస్‌ని ట్రాక్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ వాయిస్ అసిస్టెంట్‌ను కలిగి ఉంది. ఇన్‌స్టంట్ క్రికెట్ స్కోర్‌లు లేదా వాతావరణ అప్‌డేట్ల కోసం చిన్న ఆదేశాలను జారీ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. boAt Wave Flex Connect ద్వారా IP68 డస్ట్- వాటర్-రెసిస్టెంట్‌తో వాటర్, డెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే.. స్మార్ట్‌వాచ్ ఒకే ఛార్జ్‌పై 10 రోజుల వరకు నిరంతరం పని చేస్తుంది. కేవలం 2 గంటల్లో స్పీడ్ ఛార్జ్ అవుతుంది.

Read Also : Vodafone-idea OTT Plans : వోడాఫోన్ ఐడియా కొత్త రూ. 401 ప్లాన్ ఇదే.. మరెన్నో OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!