అమెరికాను అధిగమించనున్న చైనా.. 2028నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా డ్రాగన్..!

అమెరికాను అధిగమించనున్న చైనా.. 2028నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా డ్రాగన్..!

China World’s Biggest Economy as US by 2028: ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాను అధిగమించే దిశగా చైనా దూసుకెళ్తోంది. 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ చైనా అవతరించనుంది. నివేదిక ప్రకారం.. ప్రపంచమంతా Covid -19 మహమ్మారితో అతులాకుతలమైతే.. డ్రాగన్ చైనా మాత్రం ప్రత్యర్థి దేశాల కంటే ముందుగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ప్రకారం.. 2028 నాటికి అమెరికా డాలర్లను మించి చైనా అధిగమించనుందని, తద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ విలువ భారీగా పెరిగిపోతుందని అంచనా వేసింది.

ఏడాది క్రితం ఊహించిన దానికంటే అర దశాబ్దం ముందుగానే చైనా అమెరికాను అధిగమించనుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధించిన దేశాల వార్షిక లీగ్ పట్టికలో మొత్తం 193 దేశాలు ఉన్నాయని యూకే ఆధారిత కన్సల్టెన్సీ గ్రూపు తెలిపింది. కోవిడ్ -19 సంక్షోభం నుంచి చైనా త్వరగా కోలుకుందని 2020లో 2శాతం మేర వృద్ధి చెందుతుందని యుకె ఆధారిత కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. మొత్తంమీద, ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి ఈ ఏడాదిలో 4.4శాతం తగ్గుతుందని అంచనా వేసింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఒక ఏడాదిలో అతిపెద్ద పతనం ఇదే.

ప్రస్తుత ఐదేళ్ల ప్రణాళిక కాలంలో (2020-25) ఉన్నత ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశిస్తున్నామని CEBR డిప్యూటీ చైర్మన్ Douglas McWilliams పేర్కొన్నారు. ఒక ఏడాది క్రితం కంటే 5 ఏళ్ల ముందే అమెరికాను చైనా అధిగమించగలదని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రపంచ GDPలో చైనా వాటా 2000లో 3.6 శాతం నుంచి 2019లో 17.8 శాతానికి పెరిగిందన్నారు. ఇంకా పెరుగుతూనే ఉంటుందని CEBR పేర్కొంది. 2023 నాటికి అత్యంత ఆదాయ దేశంగా డ్రాగన్ చైనా మారడానికి తలసరి పరిమితి, 12,536 (£ 9,215) ను దాటిపోతుందని అంచనా. చైనాలో జీవన ప్రమాణాలు అమెరికా పశ్చిమ యూరోపియన్ దేశాల కంటే చాలా తక్కువగా ఉంటాయి.

అమెరికాలో సగటు తలసరి ఆదాయం కేవలం 63,000 డాలర్లు మాత్రమే.. అదే యూకేలో కేవలం 39,000 డాలర్లు. 2020లో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 2024లో యూకే భారతదేశాన్ని అధిగమిస్తుందని అంచనా వేసింది. 2035 నాటికి, డాలర్లలో యూకే జీడీపీ ఫ్రాన్స్, దీర్ఘకాల ప్రత్యర్థి పొరుగువారి కంటే 40శాతం అధికంగా ఉంటుందని అంచనా. గత ఏడాది ఫ్రాన్స్ యూకేలను భారత్ అధిగమించింది. ఫలితంగా రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ఆ తరువాత భారత్ యూకే వెనుక పడిపోయింది. ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్ 2035 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువనుంది.