GST Evasion: 6000 ఫేక్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసులు, రూ.57000 కోట్ల జీఎస్టీ ఎగవేత, 500 మంది అరెస్ట్
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుక్కున్నారు. ఇందులో నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా 14,108 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు.

DGGI: జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ల కేసులను డిపార్ట్‌మెంట్ గుర్తించింది. గత మూడున్నరేళ్లలో 57,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతను డీజీజీఐ గుర్తించింది. అలాగే ఈ కేసులో 500 మందిని అరెస్టు చేశారు.
జీఎస్టీ ఎగవేతను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ గత మూడు సంవత్సరాలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు 6,000 నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కేసులు గుర్తించారు. ఇందులో మొత్తం 57,000 కోట్లు రూపాయల జీఎస్టీ ఎగవేత బయటపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో 14000 కోట్ల రూపాయల విలువైన 1040 నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 91 మందిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi : ఆ మూడు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి.. వాళ్లంతా ఒక్కటే
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుక్కున్నారు. ఇందులో నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా 14,108 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. జూన్ 2023లో డీజీజీఐ దేశవ్యాప్తంగా సిండికేట్‌ల సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయడంపై దృష్టి సారించింది. జీఎస్టీ ఎగవేతదారులను అధునాతన సాంకేతిక సాధనాల ద్వారా డేటా అనలిటిక్స్ ఉపయోగించి అరెస్టు చేశారు.
ఈ పన్ను సిండికేట్‌లు తరచూ అమాయకులను ఉపయోగించుకుని ఉద్యోగాలు, కమీషన్, బ్యాంకు రుణాలు వంటివాటితో ఆకర్షిస్తారు. వారి నుంచి వారి కేవైసీ పత్రాలను తీసుకుంటారు. దీని ద్వారా వారికి తెలియకుండా నకిలీ, షెల్ సంస్థలు లేదా కంపెనీలు తెరుస్తారు. జీఎస్టీ ఎగవేతను నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా తన గూఢచార నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. అలాగే డేటా అనలిటిక్స్ ద్వారా కొత్త ప్రాంతాలలో గూఢచారాన్ని విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి: Maharashtra : ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.కోటిన్నర గెలిచిన ఎస్సై .. సస్పెండ్ చేసి షాకిచ్చిన అధికారులు