Stock Markets : నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 59,528 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమై రోజంతా పతనమవుతూనే ఉంది. ఓ దశలో 58,653 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Stock Markets : నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market (1)

stock markets losses : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రియల్టీ, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నస్టాలు చవిచూశాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మన దేశ మార్కెట్లపైన కూడా పడింది. ముఖ్యంగా ఫేస్ బుక్ షేర్ల పతనం ఐటీ షేర్లపై ప్రభావితం చూపాయి. దీనికి తోడు లాభాల్లో ఉన్న ముదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు కుంగాయి.

దీంతో మూడు రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలకు ఇవాళ బ్రేక్ పడినట్లైంది. గురువారం (ఫిబ్రవరి 3, 2022) సెన్సెక్స్ 770 పాయింట్లు తగ్గి 58,788 వద్ద ముగిసింది. నిఫ్టీ 219 పాయింట్లు తగ్గి 17,560 వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో రూపాయి మారక విలువ 74.86 గా ఉంది.

Petla Burju : పేట్ల బురుజు హాస్పిటల్‌లో గర్భిణీ ఆత్మహత్యాయత్నం

బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 59,528 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమై రోజంతా పతనమవుతూనే ఉంది. ఓ దశలో 58,653 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరలో కాస్త కోలుకుని 770.31 పాయింట్ల నష్టంతో 58,788.02 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 219.80 పాయింట్లు నష్టపోయి 17,560.20 వద్ద స్థిర పడింది.

నిఫ్టీలో హెచ్ డీఎఫ్ సీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. హీరో మోటోకార్స్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ షేర్లు లాభ పడ్డాయి. ఆటో సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఐటీ, రియల్టీ, ఆయిల్ ఆండ్ గ్యాస్ షేర్లు 1-2 శాతం క్షీణించాయి.