Elon Musk : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్‌.. ఎంతకో తెలుసా?

ఎలాన్ మస్క్‌ ప్రపోజల్‌పై సుదీర్ఘంగా చర్చించి విక్రయించాలని నిర్ణయించినట్టు ట్విట్టర్‌ బోర్డు ప్రకటించింది. విలువలు, కచ్చితత్వం, ఆర్థిక అంశాలపై కీలకంగా చర్చించామన్నారు.

Elon Musk : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్‌.. ఎంతకో తెలుసా?

Elon Musk

Elon Musk Twitter : సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ, మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ఎలాన్‌ మస్క్ కొనేశారు. మస్క్‌ ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు ఒప్పుకుంది. 44 బిలియన్లకు ట్విట్టర్ మస్క్‌ సొంతమైంది. సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 1న స్టాక్ మార్కెట్‌ ముగిసే సమయానికి ఉన్న ధర కంటే ఇది 38 శాతం ఎక్కువ అని చెప్తున్నారు. ఈ మొత్తాన్ని మస్క్‌ నగదు రూపంలో చెల్లించనున్నారు.

ఎలాన్ మస్క్‌ ప్రపోజల్‌పై సుదీర్ఘంగా చర్చించి విక్రయించాలని నిర్ణయించినట్టు ట్విట్టర్‌ బోర్డు ప్రకటించింది. విలువలు, కచ్చితత్వం, ఆర్థిక అంశాలపై కీలకంగా చర్చించామన్నారు. ట్విట్టర్ స్టాక్ హోల్డర్లకు ఇది ఉత్తమమైన మార్గమని తెలిపింది. ట్విట్టర్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేయడంతో ఇక నుంచి ఓ ప్రైవేట్ సంస్థ యజమాని ఆధీనంలో పనిచేయనుంది.

Elon Musk: టెస్లా కార్లకంటే రోబోలతోనే ఎక్కువ వ్యాపారం: ఎలన్ మస్క్

కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్‌ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ అనేది ప్రజాస్వామ్యానికి పునాది అంటూ రాసుకొచ్చారు. ఇక అమ్మకాల తర్వాత ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా స్పందించారు. ఓ కంపెనీతోపాటు వినియోగదారులతో పనిచేసేందుకు ట్విట్టర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందన్నారు.

ట్విట్టర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావించిన మస్క్… ముందుగా 9.2శాతం వాటా కొనుగోలు చేశారు. అప్పట్నుంచి ట్విట్టర్‌ను పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 14న తన తుది ఆఫర్‌ను ట్విట్టర్‌ బోర్డు ముందుంచారు మస్క్… అయితే ట్విట్టర్‌ బోర్డ్ మొదట దీనికి నిరాకరించింది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు చేసి…మస్క్‌ ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు.