ఇదేందయ్యో..నాగాలాండ్ భారత్‌లో లేదంట..!అదొక దేశమంట..!!

  • Published By: nagamani ,Published On : October 10, 2020 / 12:25 PM IST
ఇదేందయ్యో..నాగాలాండ్ భారత్‌లో లేదంట..!అదొక దేశమంట..!!

flipkart: భారతదేశంలోని రాష్ట్రమైన నాగాలాండ్ భారత్‌లో లేదని..అదోక ప్రత్యేక దేశమని అంటూ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పప్పులో కాలేసింది. దీంతో ఇండియన్స్ ఫిప్ కార్డ్ పై విరుచుకుపడ్డారు. దీంతో పాపం ఫ్లిప్ కార్ట్ తన పొరపాటుని గ్రహించింది. తన తప్పును సరిదిద్దుకుంది. తెలియక జరిగిన పొరపాటు అంటూ దయచేసి క్షమించండీ అంటూ క్షమాపణ కోరింది.


ఫ్లిప్ కార్టులో వస్తువులను..సరుకులను నాగాలాండ్‌కు ఎందుకు డెలివరీ చేయడం లేదని ఓ వినియోగదారుడు ట్విటర్‌లో ఫ్లిప్ కార్ట్ ను ప్రశ్నించాడు. దీనికి ఫ్లిప్‌కార్ట్ సమాధానమిస్తూ..తాము భారతదేశం వెలుపలికి వస్తువులను డెలివరీ చేయమని సమాధానం ఇచ్చింది. అంటూ నాగాలాండ్ భారత్ లోని రాష్ట్రమని అభిప్రాయపడింది. దీంతో నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్ మీద విరుచుకుపడ్డారు.


ఫ్టిప్‌కార్ట్ ఇచ్చిన వెర్రి సమాధానాన్ని స్క్రీన్ షాట్ తీసి తిట్టిపోశారు. వైరల్ చేసి పారేశారు. నాగాలాండ్ భారతదేశంలో అంతర్భాగం అన్న సంగతిని ఫ్లిప్‌కార్ట్ మర్చిపోవడం అత్యంత విచారకరం అని..ఆన్ లైన్ వ్యాపారాలు చేసే సంస్థకు ఈ మాత్రం తెలియకపోవటమేంటీ..అంటూ ఇష్టమొచ్చినట్లుగా ఆడేసుకున్నారు.


దీంతో నాలుక కరుచుకున్న ఫ్లిప్‌కార్ట్ ఆ సమాధానాన్ని వెంటనే డిలీట్ చేసింది. అయితే, అప్పటికే ఆ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల ఆగ్రహంతో దిగివచ్చిన ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది. అది అనుకోకుండా జరిగిన పొరపాటని వివరణ ఇచ్చుకుంది.



నాగాలాండ్ ప్రత్యేక దేశం కాదని.. నాగాలాండ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వస్తువులు డెలివరీ చేస్తామని తెలియజేస్తూ..క్షమాపణ కోరింది.