ఫోర్బ్స్ టాప్ 10 భారత కుబేరుల్లో నాల్గో స్థానంలో DMart అధినేత దమానీ

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 08:51 PM IST
ఫోర్బ్స్ టాప్ 10 భారత కుబేరుల్లో నాల్గో స్థానంలో DMart అధినేత దమానీ

Forbes India 100 Richest Indians : గత కొన్ని నెలలుగా భారత కుబేరుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ఇండియా 100 రిచెస్ట్ ఇండియన్లలో టాప్ 10 ర్యాంకులో నిలిచిన ముఖేష్ అంబానీ 63.5 బిలియన్ డాలర్లతో తన సంపదను మరింత పెంచుకున్నారు. 13వ ఏడాది కూడా అంబానీ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలో అంబానీ (1) స్థానంలో ఉండగా.. రెండో ర్యాంకులో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అధానీ ఉన్నారు..



టాప్ 10 జాబితాలో డిమార్ట్ అధినేత రాధాకృష్ణన్‌ దమానీ 15.4 బిలియన్ డాలర్లతో టాప్ 4వ ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాత కొత్తగా Serum Institute అధినేత Cyrus Poonawalla టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నారు. 11.5 బిలియన్ డాలర్ల నికర ఆధాయంతో Poonawalla టాప్ 5 ర్యాంకులో ఉన్నారు. ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో అంబానీ నుంచి లక్ష్మీ మిట్టల్ వరకు ఎంతమంది టాప్ 10 ర్యాంకుల్లో తమ సంపాదనతో చోటు దక్కించు కున్నారో ఓసారి చూద్దాం..



1. Mukesh Ambani ( 88.7 బిలియన్ డాలర్లు) :
దేశంలో కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ దేశంలోనే అత్యంత ధనికుడిగా 14శాతం తన సంపదను పెంచుకున్నారు ముఖేష్ అంబానీ. గత కొన్ని నెలల్లో అంబానీ 88.7 బిలియన్ డాలర్లతో సగానికి పైగా తన ఆదాయాన్ని పెంచుకున్నారు.Mukesh Ambani to Laxmi Mittal, these are the top 10 richest Indians of 2020 in Forbes’ India’s 100 Richest

73 శాతం పెరుగుదలతో 37.3 బిలియన్ డాలర్లకు పైగా వృద్ధి సాధించారు. మహమ్మారి సమయంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడుల్లో దూసుకుపోతూ సంస్థ అంబానీకి ఆదాయానికి ప్రధాన అస్త్రంగా మారింది.



2. Gautam Adani (25.2 బిలియన్ డాలర్లు) :
2020 ఏడాదిలో నికర ఆదాయాన్ని పెంచుకున్న భారతీయ కుబేరుల్లో ఒకరు ఆదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదానీ.. ఈయన ఆదాయం 61శాతం పెరుగుదలతో 25.2 బిలియన్లకు చేరింది. దీంతో అంబానీ తర్వాతి రెండో స్థానంలో ఆదానీ నిలిచారు.

Mukesh Ambani to Laxmi Mittal, these are the top 10 richest Indians of 2020 in Forbes’ India’s 100 Richest

ముంబై ఎయిర్ పోర్టులో 74శాతం వాటాను ఆధాని గ్రూపు దక్కించుకుంది. తదుపరి విమానశ్రయాలపై తన నియంత్రణను మరింత
విస్తరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు.



3. Shiv Nadar (20.4 బిలియన్ డాలర్లు) :
HCL టెక్నాలజీస్ అధినేత శివ నాడర్.. భారతదేశంలోని మూడో అతిపెద్ద టెక్ సంస్థ HCL సంస్థకు యజమాని. కంపెనీ చైర్మన్‌ పదవి బాధ్యతలను తన కుమార్తె రోషిణి మల్హోత్రాకు అప్పగించారు. 20.4 బిలియన్ డాలర్ల నికర ఆదాయంతో శివ నాడర్.. మూడో ర్యాంకులోకి వచ్చారు.

Mukesh Ambani to Laxmi Mittal, these are the top 10 richest Indians of 2020 in Forbes’ India’s 100 Richest

గత ఏడాదిలో ఫోర్బ్స్ జాబితాలో 6వ ర్యాంకులో ఉన్న నాడర్.. ఈ ఏడాదిలో మూడో ర్యాంకులో నిలిచారు. ఆయన షేర్ ధర పెంచడంతో ఆయన సంపద విలువ 20.4 బిలియన్ డాలర్లకు పెరిగింది.



4. Radhakishan Damani – (15.4 బిలియన్ డాలర్లు) :
రాధాకృష్ణన్‌ దమానీ Avenue Supermarts అధినేత.. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో మూడు స్థానాలు పైకి ఎగసి 15.4 బిలియన్ డాలర్లతో నాల్గో స్థానంలో నిలిచాడు. ఈయనకు మరో సొంత రిటైల్ స్టోర్ చైన్ డిమార్ట్ కూడా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దామానీ సంపద విలువ 15.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Mukesh Ambani to Laxmi Mittal, these are the top 10 richest Indians of 2020 in Forbes’ India’s 100 Richest5. Hinduja Brothers (12.8 బిలియన్ డాలర్లు) :
హిందుజా బ్రదర్స్ సంపద విలువ 12.8 బిలియన్ డాలర్లకు చేరింది. యూకేలోని కోర్టు ఫైలింగ్ ప్రకారం.. Srichan తన ముగ్గురు సోదరులతో మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ వారి సంపద విలువ సమిష్టిగా వృద్ధి చెందింది.

6. Cyrus Poonawalla – (11.5 బిలియన్ డాలర్లు) :
ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న Serum Institute అధినేత Cyrus Poonawalla ఐదో స్థానాన్ని కోల్పోయినప్పటికీ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. మహమ్మారి సమయంలో ఫార్మాసిటికల్ డ్రగ్స్ ఎక్కువగా వృద్ధి సాధించడంతో ఆయన సంపద విలువ 26 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Cyrus Poonawalla7. Pallonji Mistry – (11.4 బిలియన్ డాలర్లు) :
ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో Pallonji Mistry 7వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదిలో మిస్ట్రీ సంపద విలువ 11.4 బిలియన్ డాలర్లకు చేరింది.
Pallonji Mistry 8. Uday Kotak – (11.3 బిలియన్ డాలర్లు) :
ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో Uday Kotak 8వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదిలో Kotak సంపద విలువ 11.3 బిలియన్ డాలర్లకు చేరింది.
Uday Kotak9. Godrej Family – (11 బిలియన్ డాలర్లు) :
ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో Godrej Family 9వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదిలో Godrej Family సంపద విలువ 11 బిలియన్ డాలర్లకు చేరింది.

Godrej Family

10. Laxmi Mittal – (10.3 బిలియన్ డాలర్లు) :
ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో Laxmi Mittal 10వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదిలో Laxmi Mittal సంపద విలువ 10.3 బిలియన్ డాలర్లకు చేరింది.

Laxmi Mittal