Business News: అమెజాన్ – ఫ్యూచర్ సంస్థల పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

అమెజాన్ సంస్థ వేసిన ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) ప్రక్రియను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది.

Business News: అమెజాన్ – ఫ్యూచర్ సంస్థల పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

Business

Business News: రిలయన్స్ – ఫ్యూచర్ సంస్థకు సంబందించిన వ్యాపార లావాదేవిపై అమెజాన్ సంస్థ వేసిన ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) ప్రక్రియను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది. ఈమేరకు మంగళవారం జస్టిస్ బన్సాల్ ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్నారు. 2019లో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ సంస్థను కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చిన అమెజాన్ సంస్థ, ఫ్యూచర్ రిటైల్ తో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. అయితే అమెజాన్ తో పాక్షికంగానే ఒప్పందాలు చేసుకున్నామన్న ఫ్యూచర్ సంస్థ.. ఆమేరకు తన ఆస్తులను రిలయన్స్ సంస్థకు అమ్మెందుకు సిద్దపడింది. కాగా ఒప్పంద సమయంలో అమెజాన్ సంస్థ ఉద్దేశ్యపూర్వకంగా కొంత సమాచారాన్ని తొక్కిపెట్టినట్లు గుర్తించిన కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా(సీసీఐ) ఆమేరకు అమెజాన్ ఫ్యూచర్ ఒప్పందాన్ని రద్దు చేసింది. సమాచారాన్ని దాచి ఉంచినందుకుగాను అమెజాన్ పై రూ.200 కోట్లకు పైగా జరిమానా విధించింది సీసీఐ.

Also read: Delhi Airport: ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ ప్రయాణికులను మోసం చేస్తున్న ఏపీ యువకుడు అరెస్ట్

అయితే అమెజాన్ ఈ వ్యవహారాన్ని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (SIAC) దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో దీనిపై పూర్తి నిర్ణయం తీసుకునే వరకు ఫ్యూచర్ – రిలయన్స్ ఒప్పందం జరగకూడదంటూ ఎస్ఐఏసీ ఆదేశించింది. ఈఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. ఫ్యూచర్ సంస్థ డిసెంబర్ 31న ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది. అమెజాన్ ఫ్యూచర్ ఒప్పందాన్ని.. సీసీఐ రద్దు చేయడంతో.. భారత్ లో ఇక ఆ ఒప్పందం చెల్లదని.. దాంతో తమ ఆస్తుల విక్రయంపై అమెజాన్ ఎటువంటి హక్కులు పొందలేదంటూ ఫ్యూచర్ సంస్థ తన పిటిషన్ లో పేర్కొంది. “మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించడం చట్టవిరుద్ధం” అని డిసెంబర్ 31న వేసిన పిటిషన్ లో పేర్కొంది ఫ్యూచర్ సంస్థ. దీనిపై మంగళవారం ఢిల్లీ హై కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఒప్పందంపై వాదనలు ఇంతటితో ముగించాలన్న ఫ్యూచర్ సంస్థ విజ్ఞప్తిని సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ తిరస్కరించింది. ఈ నెల మొత్తం వాదనలు కొనసాగుతునాయని తెలిపింది.

Also read: China-India: వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న చైనా కవ్వింపు చర్యలు