World No-2: ప్రపంచ ధనవంతుల జాబితాలో మరోసారి 2వ స్థానానికి గౌతమ్ అదాని

ఇక ప్రస్తుతం 273.5 బిలియన్‌ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్‌ 10 జాబితాలో భారత్‌కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్‌ అంబాని 8వ స్థానంలో నిలిచారు. 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానం దక్కించుకున్నారు. ఇక ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న తొలి భారత, ఆసియా వ్యక్తి అదానియే కావడం విశేషం.

World No-2: ప్రపంచ ధనవంతుల జాబితాలో మరోసారి 2వ స్థానానికి గౌతమ్ అదాని

Gautam Adani became the world second richest person again

World No-2: మూడు రోజుల క్రితం ప్రపంచ ధనవంతుల్లో రెండవ స్థానానికి చేరుకుని కొద్ది సేపట్లోనే మళ్లీ మూడో స్థానానికి పడిపోయిన భారత అపర కుబేరుడు గౌతమ్ అదాని.. మరోసారి రెండో స్థానానికి ఎగబాకారు. సోమవారం ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ధనవంతుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్డ్‭ను మూడో స్థానానికి నెట్టి, రెండో స్థానంలో అదాని సెటిలయ్యారు. సోమవారం ఉదయం నాటికి గౌతమ్ అదాని సంపద 2.1 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 154.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో బెర్నార్డ్ అర్నాల్డ్‭ సంపద 2.6 బిలియన్ డాలర్లు పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం అర్నాల్డ్ సంపద 152.6 బిలియన్ డాలర్లు.

ఇక ప్రస్తుతం 273.5 బిలియన్‌ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్‌ 10 జాబితాలో భారత్‌కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్‌ అంబాని 8వ స్థానంలో నిలిచారు. 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానం దక్కించుకున్నారు. ఇక ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న తొలి భారత, ఆసియా వ్యక్తి అదానియే కావడం విశేషం.

Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల ఊరేగింపు‌ను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన బ్రిటన్ ప్రజలు.. ఫొటో గ్యాలరీ

గౌతమ్ అదాని గురించి కొన్ని ముఖ్య విషయాలు..
1. భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ముంద్రాను అదాని గ్రూప్ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ భారతదేశంలోని అతి పెద్ద థర్మల్ బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. అతిపెద్ద బొగ్గు వ్యాపారి కూడా.
2. మే 2022లో స్విస్ దిగ్గజం హోల్సిమ్ యొక్క భారతీయ సిమెంట్ విభాగాన్ని 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుచుకోవడం ద్వారా సిమెంట్ పరిశ్రమలోకి అదాని ప్రవేశించారు. ప్రపంచంలోనే గొప్ప గ్రీన్ ఎనర్జీ జనరేటర్‌గా ఎదగాలనే తపనతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో 70 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు.
3. మార్చి 2022 నుండి స్టాక్ ఎక్స్ఛేంజ్ రికార్డుల ప్రకారం.. అదాని ఎంటర్‌ప్రైజెస్, అదాని పవర్, అదాని ట్రాన్స్‌మిషన్స్‌లో అదానికి 75% యాజమాన్య వాటా ఉంది. దీనికి తోడు అదాని టోటల్ గ్యాస్‌లో 37% వాటాను, అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 65% వాటాను, అదాని గ్రీన్ ఎనర్జీలో 61% వాటాను కలిగి ఉన్నారు.
4. అదాని గత నెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్ గేట్స్‌ను అధిగమించి మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా అధిగమించారు. దీనికి ముందు అతను అత్యంత సంపన్న ఆసియా వ్యక్తిగా ఉన్న ముఖేష్ అంబానిని ఫిబ్రవరిలో అధిగమించారు.
5. అదాని కాలేజీ డ్రాపౌట్. తన తండ్రి వస్త్ర వ్యాపారంపై ఆసక్తి చూపకుండా 1988లో కమోడిటీస్ ఎగుమతి కంపెనీని స్థాపించారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడిలో అదాని ప్రాణాలతో బయటపడ్డారు.

Somu Veerraju: అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు.. దమ్ముంటే వైసీపీ మాతో చర్చకు రావాలి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు