Google: గూగుల్‌లో 12,000 మంది ఉద్యోగుల తొలగింపు.. ఎంప్లాయ్స్‌కు మెయిల్స్ పంపిన సంస్థ

గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.

Google: గూగుల్‌లో 12,000 మంది ఉద్యోగుల తొలగింపు.. ఎంప్లాయ్స్‌కు మెయిల్స్ పంపిన సంస్థ

Google: టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో గూగుల్ కూడా చేరింది. గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది.

Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. గూగుల్ షేర్లు మార్కెట్‌లో దూసుకుపోతున్నప్పటికీ, కంపెనీ ఉద్యోగాల్ని తొలగించాలనుకోవడం గమనార్హం. గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థల ద్వారా ఆల్ఫాబెట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ సంస్థకు మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుంచి పోటీ ఎదురవుతోంది. ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల సంస్థపై రివ్యూ జరిపారు. సంస్థ ఉత్పత్తులు, సిబ్బంది, ప్రాధాన్యతలు, ఉద్యోగాలు వంటి అంశాలపై సమీక్ష జరిపి ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ నిర్ణయం అమలవుతుంది.

Andhra Pradesh: ఏపీలో ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకం.. ఆమోదం తెలిపిన సీఎం జగన్

సంస్థ బాగానే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పూర్తి బాధ్యత తనదే అని సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు చెప్పారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెంటనే అమలుకానుంది. అమెరికాలో ఎక్కువగా ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉంది. అయితే, అనేక దేశాల్లో ఉన్న స్థానిక చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆలస్యం కావొచ్చు. ఉద్యోగాలు కోల్పోయే వారికి ఇప్పటికే మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చింది సంస్థ.