విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం

బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు చెందిన రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది.

  • Published By: sreehari ,Published On : April 5, 2019 / 06:24 AM IST
విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం

బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు చెందిన రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది.

బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో పాకిస్తాన్ కు చెందిన రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మింది. విప్రోలో ఉన్న బ్లాక్ డీల్స్ కు సంబంధించిన మేజర్ ఎనమీ షేర్లను ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 5, 2019) అమ్మేసింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ కస్టోడియన్ ఎనమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (CEPI)కు చెందిన షేర్లుగా చూపించిన షేర్లను స్వాధీనం చేసుకుంది. బ్లాక్ డీల్స్ షేర్లను ప్రభుత్వం అమ్మడం ఇదే తొలిసారి.

విప్రోలో పెట్టిన కోట్లాది షేర్లు పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. దీంతో 1968 ఎనమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ఆయా షేర్లను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 1960లో పాకిస్థాన్, చైనా దేశాలతో ఇండియాకు విభేదాలు తలెత్తిన అనంతరం ఈ ఎనమీ ప్రాపర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అజీమ్ ప్రేమ్ జీ సొంత కంపెనీకి చెందిన 4.3 కోట్ల షేర్లను సీఈపీఐ అమ్మేసింది. ఇందులో దాదాపు 3.9 కోట్ల షేర్లు ఎల్ఐసీ కొన్న షేర్లు ఉన్నాయి. విప్రో షేర్లలో ఇద్దరు పాకిస్థానీలకు చెందిన షేర్లు ఉన్నాయి. ఈ షేర్లలో రూ.3వేల కోట్లు ఉన్నట్టు అంచనా వేస్తుండగా.. అందులో రూ.లక్ష కోటి షేర్లు స్థిర ఆస్తులు (భూఆస్తులు) కస్టోడియన్ ఎనమీ ఆస్తులుగా గుర్తించారు. 
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ

2017లో ఎనమీ ప్రాపార్టీ యాక్ట్ ను సవరించడంతో పాకిస్థాన్, చైనాకు వలసపోయిన వారంతా విప్రోలో షేర్లు పెట్టేందుకు సాధ్యపడింది. దేశం నుంచి విడిపోయిన తర్వాత ఇండియాలో వదిలిపోయిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి దావా వేయలేదు. ఎనమీ ప్రాపర్టీ యాక్ట్ సవరణపై 2005లో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం.. సొంత యజమాని వదిలివెళ్లిన ఆస్తులు కస్టోడియన్ అడ్మినిస్ట్రేటర్ కు మాత్రమే చెందుతాయి. ఒకవేళ ఎనమీ యజమాని చనిపోయినా లేదా పాకిస్థాన్, చైనా దేశాలకు వలస వెళితే.. ఆ ప్రాపర్టీ.. భారత దేశస్థులకే చెందుతుందని కోర్టు పేర్కొంది.

2018 నవంబర్ లోనే ఎనమీ ప్రాపర్టీ షేర్లను అమ్మే మెకానిజం ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. షేర్ల అమ్మకంపై ఫిబ్రవరిలో హైలెవల్ కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేశారు. దేశంలో మొత్తం మీద 6.5 కోట్ల షేర్లు.. 996 కంపెనీల్లో ఉండగా.. అందులో 20వేల 323 మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. వీరంతా సీఈపీఐ కింద ప్రాపర్టీ కలిగినవారే. పాకిస్థాన్ లో కూడా భారతీయులకు సంబంధించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ తమకు చెల్లించిన అప్పులుగా చూపించుకోవడం గమనార్హం. 
Read Also : పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్‌.అంబేద్కర్ మనవడు