టిక్‌టాక్ అభిమానులను ఆశపెట్టే న్యూస్. TikTokను ఇండియాకు సాఫ్ట్‌బ్యాంక్ తీసురానుందా?

  • Published By: sreehari ,Published On : September 4, 2020 / 12:57 PM IST
టిక్‌టాక్ అభిమానులను ఆశపెట్టే న్యూస్. TikTokను ఇండియాకు సాఫ్ట్‌బ్యాంక్ తీసురానుందా?

టిక్ టాక్ ఫ్యాన్స్‌కు ఆశపెట్టే న్యూస్.. చైనా యాప్ టిక్‌టాక్ మళ్లీ తిరిగి వస్తుందా? టిక్‌టాక్‌ను ఇండియాకు సాఫ్ట్ బ్యాంక్ తీసుకరానుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.. సాఫ్ట్ బ్యాంక్ గ్రూపు కార్పొరేషన్ టిక్ టాక్ ఇండియా కోసం బిడ్డర్లను పరిశీలిస్తోంది. ఇండియాలో టిక్ టాక్ వాటాలపై స్థానిక పార్టనర్లతో కలిసి బిడ్డింగ్ కోసం అన్వేషిస్తోంది.

చైనీస్ పేరంట్ కంపెనీ  ByteDance Ltdలో వాటా ఉన్న జపనీస్ గ్రూపు, భారత రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ లిమిటెడ్ అధినేతలతో సాఫ్ట్ బ్యాంకు గతనెలగా సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి ఈ చర్చల వివరాలను ప్రైవేటుగా ఉంచినట్టు సంబంధిత వర్గాల సమాచారం.. సాఫ్ట్ బ్యాంకు, బైట్ డాన్స్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ కు చెందిన ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.



ఇండియాలో స్థానిక ప్రభుత్వాలు చైనా టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించడంతో అప్పటినుంచి టిక్ టాక్.. అనేక దేశాల్లో తమ కార్యకలాపాలను విక్రయించే పనిలో పడింది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

టిక్ టాక్ కార్యకలాపాలు సాగించే దేశాల్లో అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.. 200 మిలియన్లకు పైగా టిక్ టాక్ యూజర్లు ఉన్నారు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్ టాక్ నిషేధంపై హెచ్చరించారు.. జాతీయ భద్రతా సమస్యల కారణంగా దేశంలో తమ టిక్ టాక్ ఆస్తులను విక్రయించు కోవచ్చునని బైట్ డాన్స్ ను ట్రంప్ ఆదేశించారు.



బైట్ డాన్స్‌లో సాఫ్ట్ బ్యాంకుకు కేవలం చిన్న వాటా మాత్రమే ఉంది.. అయినప్పటికీ టిక్ టాక్ వాటాల విక్రయాల చర్చల్లో పెద్ద పీట వేసింది. అమెరికాలో గూగుల్ పేరంట్ ఆల్ఫాబెట్ ఇంక్ సహా బిడ్డర్ల గ్రూపులో జపాన్ కంపెనీ వాల్మార్ట్ ఇంక్ ను ప్రధాన పెట్టుబడిదారుగా తీసుకువచ్చింది.



సాఫ్ట్ బ్యాంకు సలహాదారు సెంట్రికస్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో టిక్ టాక్ కార్యకలాపాల కోసం 20 బిలియన్ డాలర్లకు ట్రిల్లర్ ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం..