Anil Ambani : పన్ను ఎగవేతలపై అంబానీకి ఐటీ శాఖ నోటీసులు

పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై   ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్   గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ  చేశారు.

Anil Ambani : పన్ను ఎగవేతలపై  అంబానీకి ఐటీ శాఖ నోటీసులు

anil ambani

Updated On : August 24, 2022 / 10:46 AM IST

Anil Ambani : పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై   ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్   గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ  చేశారు.

రెండు స్విస్ ఖాతాల్లో రూ.814 కోట్ల ను రహస్యంగా దాచిన నిధులపైనా … రూ. 420 కోట్ల రూపాయల పన్నులను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేశారని ఐటీ శాఖ ఆరోపణలు మోపింది.  అనిల్ అంబానీ విదేశాల్లోని బ్యాంకు ఖాతాల గురించి ఆదాయపన్ను రిటర్న్‌లలో కావాలనే వెల్లడించలేదని ఆరోపించింది. దీనికి సంబంధించి ఆగస్టు మొదటి వారంలోనే ఐటీ శాఖ అంబానీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

2012-13 నుంచి 2019-20 అసెస్‌మెంట్‌ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని ఆస్తులను వెల్లడించక పోవడం ద్వారా అనిల్‌ అంబానీ పన్నులు ఎగవేశారని ఐటీ శాఖ పేర్కోంది.  ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని  సూచించింది.   డైమండ్‌ ట్రస్ట్,  నార్తర్న్‌ అట్లాంటిక్‌   ట్రేడింగ్‌ అన్‌లిమిటెడ్‌ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థలలో  కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్‌ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి.

2015 నాటి నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం మరియు ఆస్తులు)  పన్ను చట్టంలోని 50 మరియు 51 సెక్షన్‌ల కింద అనిల్ అంబానీ ప్రాసిక్యూట్ చేయబడ్డాడని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఒకవేళ ఈ నేరం రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానాతో కూడిన శిక్ష పడే అవకాశం ఉంది

Also Read : Black Panther : మధ్యప్రదేశ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత-వైరల్ వీడియో