ITR 2022 : ఐటీ రిటర్న్ ఆలస్యంగా ఫైల్ చేస్తే … పెనాల్టీ, కాకుండా కొన్ని ప్రయోజనాలు కోల్పోతారు

ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు   రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు  చెపుతున్నారు.

ITR 2022 : ఐటీ రిటర్న్ ఆలస్యంగా ఫైల్ చేస్తే … పెనాల్టీ, కాకుండా కొన్ని ప్రయోజనాలు కోల్పోతారు

Itr Last Date

ITR 2022 :  ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు   రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు  చెపుతున్నారు.    గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు రేపు ఆదివారం, జులై 31 తో ముగుస్తుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఐటీ రిటర్న్ దాఖలు చేసే గడువును పెంచిన కేంద్రం ఈ ఏడాది గడుపు పొడిగిచేది లేదని తేల్చి చెప్పింది.

ఒకవేళ మీరు జూలై 31 లోపు ITR ఫైల్ చేయడంలో విఫలమైతే… డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే,అందుకు మీరు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందువల్ల కొన్ని ఆర్ధిక ప్రయోజనాలకు కోల్పోతారని నిపుణులు చెపుతున్నారు.

గతంలో ఈ పెనాల్టీ రూ.10,000 లుగా ఉండేది. ఈ ఏడాది దీన్ని రూ. 5,000 చేశారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు రూ.5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానాగా చెల్లించాలి.

ఆలస్యంగా ఫైల్ చేస్తే కోల్పోయే ప్రయోజనాలు
…ITR ఆలస్యంగా పైల్ చేయటంవలన మూలధనరాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే వీలుండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేయగలరు
…రిటర్నులు సక్రమంగా ఫైల్ చేసి, ధృవీకరించుకున్న తర్వాతే రీఫండ్ లభిస్తుంది. రిటర్నులు దాఖలుకు అలస్యమయ్యే కొద్దీ రీఫండ్ ఆలస్యం అవుతుంది.
…ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయటం వల్ల రీఫండ్ అలస్యమైన ప్రతి నెలకూ 0.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేయటం ఆలస్యం అయితే రీఫండ్ మీద వచ్చే వడ్డీ కోల్పోతారు.
…పన్ను చెల్లింపుదారుల వైపునుంచి ఏమైనా బకాయిలు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి గడువు తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
…2022 డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది.