Gold Hallmarking : బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి.. ఈ నియమాలు పాటించాల్సిందే!

కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా.. గోల్డ్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బంగారం హాల్ మార్కింగ్ ఈరోజు (జూన్ 15) నుంచి తప్పనిసరి కానుంది. గతంలో ఈ గడువు జూన్ 1వరకు ఉండగా.. ఇప్పుడు దీన్ని జూన్ 15కు పొడిగించారు.

Gold Hallmarking : బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి.. ఈ నియమాలు పాటించాల్సిందే!

Gold Hallmarking

Gold Hallmarking : కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా.. గోల్డ్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బంగారం హాల్ మార్కింగ్ ఈరోజు (జూన్ 15) నుంచి తప్పనిసరి కానుంది. గతంలో ఈ గడువు జూన్ 1వరకు ఉండగా.. ఇప్పుడు దీన్ని జూన్ 15కు పొడిగించారు. హాల్ మార్క్ లేకుండా నేటి నుంచి బంగారు ఆభరణాలు విక్రయించరాదు.. లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జ్యువెల్లరీ కొనే సమయంలో హాల్ మార్క్ ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం.. అన్ని జ్యువెల్లరీ షాపులు తప్పనిసరిగా పాటించాల్సిందే.

జూన్ 15 నుంచి గోల్డ్ మర్చంట్లు BIS హాల్‌మార్కింగ్ సర్టిఫైడ్ బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అసలు హాల్‌మార్కింగ్ అంటే ఏంటో తెలుసా? హాల్ మార్కింగ్ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధృవీకరిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పర్యవేక్షిస్తుంది.ఆభరణాలు హాల్‌మార్క్ ప్రింట్ అయి ఉంటే.. దాని స్వచ్ఛత ధృవీకరించినట్టు అర్థం చేసుకోవాలి. హాల్‌మార్క్‌లోని BIS ప్రింట్, బంగారు క్యారెట్ డేటా, సెంటర్ లోగో, హాల్‌మార్కర్ డేటాతో మొత్తంగా 4 గుర్తులు ఉంటాయి.

కస్టమర్ల ప్రయోజనాలు కోసమే హాల్ మార్క్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ విధానం అమలు ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్ హాల్‌మార్కింగ్.. బంగారం స్వచ్ఛతను ధృవీకరించే లోగో. హాల్‌మార్కింగ్‌ పొందడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలు ప్రవేశపెట్టింది. బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసే వినియోగ‌దారుడు మోస‌పోకుండా ఉండేందుకు BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను కేంద్రం ఏర్పాటు చేసింది.

బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఒరిజినల్‌ నగలను గుర్తించడం కష్టంగా మారింది. గోల్డ్ ఒరిజినల్‌, నకిలీవి అనేది తేడా తెలియని పరిస్థితి. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్‌ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. 20 నవంబర్ 2021 నుండి దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, కళాఖండాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయనున్నట్టు 2019 నవంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా మధ్య గడువు రెండుసార్లు పొడిగించింది.

బంగారం హాల్‌మార్కింగ్ నియమాలివే..
1) గోల్డ్ హాల్‌మార్కింగ్ స్వచ్ఛత ధృవీకరణను తెలియజేస్తుంది..
2) 15 జూన్ 2021 నుంచి ఆభరణాలకు 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది.
3) ప్రస్తుతం బంగారు హాల్‌మార్కింగ్ స్వచ్ఛందంగా ఉంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా హాల్‌మార్క్ తప్పనిసరి.
4) నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. బంగారం, వెండి భారతదేశంలో హాల్‌మార్కింగ్ పరిధిలోకి వస్తాయి.
5) BIS ఇప్పటికే ఏప్రిల్ 2000 నుండి బంగారు ఆభరణాల కోసం హాల్‌మార్కింగ్ స్కీమ్ రన్ చేస్తోంది.
6) గత ఐదేళ్లలో అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో 25 శాతం పెరుగుదల ఉంది.
7) ఈ కేంద్రాల ప్రస్తుత సామర్థ్యంతో ఏడాదిలో సుమారు 14 కోట్ల వరకు హాల్‌మార్క్ చేయవచ్చు.
8) ప్రస్తుతం 40 శాతం బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ చేస్తున్నారు.
9) BIS ప్రకారం.. తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఆభరణాలపై గుర్తించిన విధంగా వినియోగదారులకు స్వచ్ఛతను పొందేలా చేస్తుంది.
10) ప్రపంచ బంగారు మండలి ప్రకారం.. భారతదేశంలో సుమారు 4 లక్షల మంది జ్యులర్లు ఉన్నాయి. వాటిలో 35,879 మందికి మాత్రమే BIS సర్టిఫికేట్ లభించింది
11 BIS-Care అనే అనువర్తనం ఇండియాలో అందుబాటులో ఉంది. ఖచ్చితత్వాన్ని తనిఖీతో పాటు ఫిర్యాదు చేయవచ్చు.