Infosys: Infosys: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 45వేల ఉద్యోగాలు

కరోనా కారణంగా ప్రతీ రంగం కుదేలైన పరిస్థితి. అయితే, మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వస్తుంది.

Infosys: Infosys: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 45వేల ఉద్యోగాలు

Tcs, Infosys, Mindtree Dole Out 100% Quarterly Variable Pay To Cut Attrition

Infosys: కరోనా కారణంగా ప్రతీ రంగం కుదేలైన పరిస్థితి. అయితే, మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వస్తుంది. టెక్ నిపుణుల అవసరం కూడా ఎక్కువగా ఉంటుండగా.. డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు నియామక భారీగా చేపడుతున్నాయి. బెంగళూరు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఫ్రెషర్స్ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది.

మీరు ఫ్రెషర్స్ అయితే మీకు ఇది సువర్ణావకాశమే. దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఈ సంవత్సరం కంపెనీలో 45వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్ధమైంది. టెక్నికల్‌గా ఉద్యోగులను నియమించుకునేందుకు ఇప్పుడు IT కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులను నియమించుకునేందుకు పోటీ పడుతుంది.

ప్రవీణ్ రావు, COO(UB), ఇన్ఫోసిస్ ఈమేరకు ప్రకటనలో “మార్కెట్లో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, మేము ఈ సంవత్సరం కాలేజ్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాము. మా ఉద్యోగుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మ్యాన్ పవర్ పెంచాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పారు.

ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు: 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) రెండవ త్రైమాసికానికి సంబంధించి ఇన్ఫోసిస్ బుధవారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగియగా.. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.9 శాతం పెరిగి రూ .5,421 కోట్లకు చేరుకుందని, కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4,845కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది.