iPhone 13 Price Offer : వచ్చే వారమే ఐఫోన్ 14 వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?

iPhone 13 Price Offer : ఆపిల్ ఐఫోన్ (Apple) నుంచి మరో కొత్త ఐఫోన్ గ్లోబల్ మార్కెట్లో వస్తోంది. అదే.. ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) ఫోన్.. వచ్చే వారమే లాంచ్ కానుంది. ఇంతలోనే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Filpkart)లో iPhone 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

iPhone 13 Price Offer : వచ్చే వారమే ఐఫోన్ 14 వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?

iPhone 13 Price Offer : ఆపిల్ ఐఫోన్ (Apple) నుంచి మరో కొత్త ఐఫోన్ గ్లోబల్ మార్కెట్లో వస్తోంది. అదే.. ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) ఫోన్.. వచ్చే వారమే లాంచ్ కానుంది. ఇంతలోనే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Filpkart)లో iPhone 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటివకే ఎవరైనా ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 13 ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ పాత ఐఫోన్ (iPhone) లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ (Android Phone)ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే.. మరో వారంలో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) లాంచ్ కానుంది. మరి.. ఐఫోన్ 13 కొనుగోలు చేస్తారా? లేదా రాబోయే ఐఫోన్ 14 కోసం ఎదురుచూడాలా? అనే ప్రశ్న రావొచ్చు.

వాస్తవానికి గత ఏడాదిలో ఐఫోన్ 13 మోడల్ లాంచ్ కాగా.. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అందులోనూ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం Flipkartలో ఇదే బెస్ట్ డీల్. iPhone 13 (128GB) స్టోరేజీ మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.14వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. దీనిపై అదనంగా తగ్గింపు పొందవచ్చు. Flipkart అధికారికంగా iPhone 13ని ధర రూ.65,999కి విక్రయించనుంది.

Apple ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 13 భారత్‌లో ధర రూ. 79,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఫ్లాట్ రూ. 14వేల ధరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), HDFC కొన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లను అందించనున్నాయి. కొనుగోలుదారులు ఎవరైనా.. ఫ్లాట్ తగ్గింపు (Flat Discount)పై రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 13 ధర రూ. 64,999కి సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ ఆఫర్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.

ఇప్పుడు, మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే.. అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. Flipkart ద్వారా అధిక రేటుకు మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం Exchange Value ధర రూ. 19వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా మీరు కొనుగోలు చేసే ఐఫోన్ 13 ధరను మరింత తగ్గనుంది. మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది.. మీ ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

iPhone 13 is available for lowest ever price on Flipkart should you buy or wait

iPhone 13 is available for lowest ever price on Flipkart should you buy or wait

Apple iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 7న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. iPhone 13, iPhone 12 వంటి పాత మోడళ్లతో సహా పాత iPhone ధరలను ఆపిల్ భారీగా తగ్గించనుంది. కుపర్టినో టెక్ దిగ్గజం సాధారణంగా కొత్త మోడల్‌లను లాంచ్ చేసిన వెంటనే పాత ఐఫోన్ మోడల్‌ ధరలను తగ్గిస్తుంది. ఈ ఏడాది కూడా ఆపిల్ పాత మోడళ్లనే అంచనా వేసింది. ఒకవేళ మరికొన్ని వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు ఐఫోన్ 13ని మరింత మెరుగైన డీల్‌తో పొందవచ్చు. కానీ, అత్యవసరమైతే.. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు.

ఐఫోన్ 13 రూ. 64,999 (బ్యాంక్ ఆఫర్ తర్వాత) పొందవచ్చు. మీరు మీ ఫోన్ చేసుకునేందుకు పాత ఐఫోన్‌ని కలిగి ఉన్నారా? మీరు ఐఫోన్ 13ని చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అధికారికంగా, ఐఫోన్ 13 ప్రస్తుతం భారత్‌లో రూ. 79,990 నుంచి రూ. 1,09,900 వరకు ఉంది. అలాగే 128GB, 256GB, 512GB అనే మూడు వేరియంట్‌లలో వస్తుంది. మొత్తంమీద, నివేదికల విషయానికొస్తే.. iPhone 13తో పోల్చినప్పుడు iPhone 14 కేవలం కొన్ని అప్‌గ్రేడ్‌లను అందించగలదని చెప్పవచ్చు.

రాబోయే iPhone మోడల్ కొంచెం పవర్‌ఫుల్ చిప్‌సెట్.. లేటెస్ట్ iOS వెర్షన్, అద్భుతమైన కెమెరాలతో వస్తోంది. బ్యాటరీ పనితీరు బాగుండాలి. ఐఫోన్ 14 విషయానికి వస్తే.. చాలా పెద్ద అప్‌గ్రేడ్‌లు ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఐఫోన్ 13 లాంచ్ ధర కంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. నా అభిప్రాయం ప్రకారం.. ఐఫోన్ 13 మరింత అర్ధవంతంగా ఉంటుంది. మీరు ఒక ఏడాది నాటి చిప్‌సెట్, A15 బయోనిక్ చిప్, తక్కువ-కాంతి కెమెరాల కోసం ఐఫోన్ 14 డిజైన్ ఐఫోన్ 13 మాదిరిగానే, వైడ్ నాచ్‌తో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ప్రో మోడల్స్ ఫ్రంట్ సైడ్ పిల్ ఆకారపు డిజైన్‌తో రానుంది.

Read Also : Apple iPhone 14 Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 14 Max మోడల్ వస్తోంది.. సెప్టెంబర్ 7న లాంచ్ అయ్యే ఛాన్స్..!