iPhone Maker Foxconn In Telangana: అందరి దృష్టీ ఇప్పుడు తెలంగాణపైనే.. ఏమిటీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్?

ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఏ దేశ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది? దాని చరిత్ర ఏంటి? వంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం. ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్ తైవాన్ కు చెందిన కంపెనీ. హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ గానూ దీనికి పేరు ఉంది. ఇది మల్టీనేషన్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. ప్రపంచంలోనే అదిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. బ్లాక్ బెర్రీ ఫోన్లు, ఐప్యాడ్, ఐఫోన్లు, కిండ్ల్, నోకియా, సిస్కో, సోనీ డివైస్ లు, గూగుల్ పిక్సెల్ ఫోన్లు, చివరకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ ల తయారీకి కూడా ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ పెద్ద దిక్కుగా మారింది.

iPhone Maker Foxconn In Telangana: అందరి దృష్టీ ఇప్పుడు తెలంగాణపైనే.. ఏమిటీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్?

iPhone Maker Foxconn In Telangana

iPhone Maker Foxconn In Telangana: దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేయడంతో రాష్ట్రంలో దాదాపు లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థగా పేరు తెచ్చుకున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చైర్మన్‌ యంగ్‌ లియు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాయడంతో ఆ కంపెనీ గురించి భారత్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆ కంపెనీ రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్‌ లో (హైదరాబాద్ శివారులో) తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్ గా తెలంగాణ ఇమేజ్ మరింత పెరగనుంది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా బాగా ఆసక్తి చూపుతోంది. ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో కేవలం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్, దాని వల్ల చేకూరే ఆర్థిక ప్రయోజనాల విషయంలోనే కాకుండా రాష్ట్రాల కీర్తి, బ్రాండ్ పేరు మరింత పెరుగుతుంది.

దీంతో తెలంగాణపై అందరి దృష్టి మళ్లింది. కొత్త ప్లాంట్ కోసం పెట్టుబడులు పెట్టడానికి ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు సమాచారం. దాని ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయనుంది. ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దీంతో తమ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్ కు తరలించాలని ఆపిల్ కూడా భావిస్తోంది.

అసలు ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఏ దేశ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది? దాని చరిత్ర ఏంటి వంటి విషయాలను తెలుసుకుందాం. ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్ తైవాన్ కు చెందిన కంపెనీ. హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ గానూ దీనికి పేరు ఉంది. ఇది మల్టీనేషన్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. ప్రపంచంలోనే అదిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థను టెర్రీ గౌ 1974లో స్థాపించారు. అప్పట్లో టెలివిజన్ సెట్ల ప్లాస్టిక్ పార్టుల తయారీ సంస్థగా ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ సంస్థ అభివృద్ధి చెందుతూ.. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ ఉత్పత్తులు, సర్వీస్ ప్రొవైడర్ గా రూపుదిద్దుకుంది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి దాని వ్యవస్థాపకుడు టెర్రీ గౌ 2019 పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చైర్మన్‌ యంగ్‌ లియు కొనసాగుతున్నారు. ఆయనే తాజాగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

అమెరికా, కెనడా, చైనా, జపాన్ వంటి దేశాల్లోని దిగ్గజ సంస్థలకు అనేక రకాల ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఉంది. బ్లాక్ బెర్రీ ఫోన్లు, ఐప్యాడ్, ఐఫోన్లు, కిండ్ల్, నోకియా, సిస్కో, సోనీ డివైస్ లు, గూగుల్ పిక్సెల్ ఫోన్లు, చివరకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ ల తయారీకి ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ పెద్ద దిక్కుగా మారింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, గేమింగ్ కన్సోళ్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, సోనీ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ క్లయింట్లుగా ఉన్నాయి. యాపిల్ అతిపెద్ద సరఫరాదారుగానూ ఫాక్స్ కాన్ ఉంది.

Moto G73 5G Launch India : మార్చి 10న మోటో G73 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!