Moto G73 5G Launch India : మార్చి 10న మోటో G73 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్‌లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్‌ కానుంది.

Moto G73 5G Launch India : మార్చి 10న మోటో G73 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

Moto G73 5G Full Specifications Officially revealed ahead of March 10 India launch

Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే (Moto G73 5G) ఫుల్ స్పెసిఫికేషన్‌లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ మొదటిసారిగా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. Moto G73 5G ఫోన్ ప్రస్తుతం (Motorola India) వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. దేశంలో ఈ ఫోన్ ధర రూ. 20వేల లోపు ఉంటుందని ట్విట్టర్‌లోని టిప్‌స్టర్ పేర్కొన్నారు. రెడ్‌మి నోట్ Redmi Note 12 5G, Realme 10 Pro మరిన్నింటి ప్రముఖ పోటీదారులతో ఈ డివైజ్ పోటీపడుతుంది.

Moto G73 ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, లూసెంట్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ఒకే 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో రానుంది. మోటరోలా ఇండియా 256GB ఇంటర్నల్ స్టోరేజీతో G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయలేదు. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Moto G73 5G ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

డిస్ప్లే ప్యానెల్ LCD, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ బాడీ (PMMA) టెక్నికల్‌గా ప్లాస్టిక్, గ్లాస్ డిజైన్ అందిస్తుంది. పాత Motorola G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇదే మెటీరియల్ అందించింది. Moto G73 డివైజ్ కొంచెం మందం (8.29mm)గా, బరువు 181 గ్రాములు ఉంటుంది. వెనుకవైపు, డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ కూడా ఉంది. మాక్రో కెమెరాగా రెట్టింపు అవుతుంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ Full-HD వీడియోలను 60fps వద్ద రికార్డ్ చేయగలదు.

Moto G73 5G Full Specifications Officially revealed ahead of March 10 India launch

Moto G73 5G Launch India : Moto G73 5G Full Specifications Officially revealed

Read Also : Happy Holi 2023 : హోలీ 2023.. వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలి? మీ స్నేహితులకు ఎలా పంపాలో తెలుసా? పూర్తి వివరాలివే..!

ప్రైమరీ కెమెరా 2um అల్ట్రా-పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. రాత్రిపూట మంచి ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. కెమెరా యాప్ అల్ట్రా-రెస్ డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మాక్రో విజన్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, AR స్టిక్కర్‌లు, ప్రో మోడ్ (లాంగ్ ఎక్స్‌పోజర్‌తో), స్మార్ట్ కంపోజిషన్, ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. కెమెరా యాప్ ద్వారా నేరుగా ఇమేజ్‌లు లేదా QR కోడ్‌లలోని వస్తువులను స్కాన్ చేసేందుకు యూజర్లను అనుమతించడానికి Google లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా పనిచేస్తుంది.

Full-HD వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేసేందుకు ఫ్రంట్ కెమెరా వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. Moto G73 5Gలో ‘హైబ్రిడ్ డ్యూయల్-సిమ్’ ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh ఉన్నాయి. ఈ ఫోన్‌కి ఫింగర్‌ప్రింట్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5G సపోర్ట్ (12 బ్యాండ్‌లు) కూడా లభిస్తాయి.

Moto G73 5G ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తుంది. ఈ ఫీచర్లన్నీ MediaTek Dimensity 930 ద్వారా పనిచేస్తాయి. పైన పేర్కొన్న MediaTek SoC (సిస్టమ్-ఓవర్-చిప్)తో భారత మార్కెట్లో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా మారుతుంది. Moto G73 అధికారిక Motorola ఇండియా ఛానెల్‌లు, (Flipkart) ద్వారా రిటైల్ అవుతుంది.

Read Also : Aadhaar Update in Telugu : ఇకపై ఆధార్ అప్‌డేట్ చేస్తే చాలు.. ఇతర డాక్యుమెంట్లలోనూ మీ డేటా ఆటో అప్‌డేట్ కానుంది తెలుసా?