Jio AirFiber Plans : ఈ 8 నగరాల్లోనే కొత్త జియోఫైబర్ సర్వీసులు.. హైస్పీడ్ డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి!
Jio AirFiber : రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని దేశంలోని 8 నగరాల్లో ప్రారంభించింది. ఈ సర్వీసు హై-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్, ఇతర ఫీచర్లతో 6 ప్లాన్లను అందిస్తుంది.

Jio AirFiber now available in 8 cities offering upto 1Gbps speed
Jio AirFiber Plans : జియోఫైబర్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? దేశంలో ఈ 8 నగరాల్లో జియోఫైబర్ సర్వీసులు (Jio AirFiber Services in India) అందుబాటులో ఉన్నాయి. ఈ జియో సర్వీసుల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ బెనిఫిట్స్, ఇతర ఫీచర్లతో మొత్తం 6 ప్లాన్లను అందిస్తుంది. యూపీఐ (UPI Payments) నుంచి ప్రభుత్వ సౌకర్యాల డిజిటలైజేషన్ వరకు ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్ అవసరంగా మారింది. అయినప్పటికీ, మొబైల్ నెట్వర్క్, కేబుల్ ఫైబర్ నెట్‌వర్క్‌లు ప్రతిచోటా అందుబాటులో ఉండవు. అందుకే, వేగవంతమైన వైర్లెస్ కనెక్షన్‌తో జియో చివరకు సెప్టెంబర్ 2023లో (JioAirFiber)ని అందించడం ప్రారంభించింది.
జియోఫైబర్ అనేది జియో నుంచి వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగిస్తుంది. గృహ వినోదం, స్మార్ట్ హోమ్ సర్వీసులు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అవసరాలను తీర్చడానికి రూపొందించింది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్లతో స్పీడ్ అందిస్తుంది. వినియోగదారులు గరిష్టంగా 1 Gbps స్పీడ్ కూడా యాక్సెస్ చేయవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ 4G డాంగిల్ల మాదిరిగానే ఉంటుందని, అయితే 5G ద్వారా బ్రాడ్‌బ్యాండ్-వంటి స్పీడ్ వంటి అదనపు బెనిఫిట్స్ ఉంటుందని జియో పేర్కొంది. వినియోగదారులు 30Mbps, 100Mbps, 150Mbps, 300Mbps, 500Mbps, 1Gbps ప్లాన్ల నుంచి ఎంచుకోవచ్చు.
ఈ 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులు :
దేశవ్యాప్తంగా JioAirFiber సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం, ఈ సర్వీసు కేవలం 8 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే ఉన్నాయి.
జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని ఎలా బుక్ చేయాలి (How to Book Jio AirFiber) :
జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి జియో వెబ్సైట్, (My Jio App) యాప్‌కి వెళ్లండి లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించండి. వెంటనే బుకింగ్ ప్రారంభించండి. మీరు 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, జియో వెబ్సైట్ లేదా మై జియో యాప్‌ని విజిట్ చేయడం లేదా మీ సమీపంలోని జియో స్టోర్‌ని విజిట్ చేయడం ద్వారా కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ కోసం రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన వివరాలను అందించండి. నిర్ధారణ కోసం వేచి ఉండండి.
మీ భవనం లేదా ప్రదేశంలో సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పుడు జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీ బుకింగ్ తర్వాత WiFi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌తో కూడిన మీ జియో AirFiber కనెక్షన్‌ని అందుకుంటారు. మీ టెర్రేస్/రూఫ్‌టాప్ లేదా మీ ఇంటి వెలుపల కూడా అవుట్డోర్ యూనిట్ ఇన్స్టాల్ చేస్తారు.
జియో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త కనెక్షన్‌ని అందిస్తోంది. అయితే, కంపెనీ రూ. 1,000 ఇన్స్టాలేషన్ సర్వీసు ఛార్జ్ చేస్తుంది. మీరు వార్షిక ప్లాన్‌ని ఎంచుకుంటే ఈ రుసుము మాఫీ చేస్తారు. వినియోగదారులు వార్షిక ప్లాన్ ప్రయోజనాలను పొందుతూనే క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆధారిత EMIని ఉపయోగించి నెలవారీగా చెల్లించే అవకాశం కూడా ఉంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఏమి ఉన్నాయంటే? :
జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు నుంచి కంపెనీ 6 ఎయిర్‌ఫైబర్ ప్లాన్లను ఆవిష్కరించింది, ప్రతి ఒక్కటి హై-స్పీడ్ ఇంటర్నెట్, సప్లిమెంటరీ ఫీచర్లను అందిస్తోంది. ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు రెండు విభిన్న కేటగిరీలలో వస్తాయి. అందులో AirFiber, AirFiber Max ప్లాన్లు ఉన్నాయి.

Jio AirFiber Plans now available in 8 cities
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు (Jio AirFiber Plans) :
ఈ కేటగరీ కింద జియో వరుసగా రూ. 599, రూ. 899, రూ. 1199 ధరల పాయింట్లతో 3 ప్లాన్లను అందజేస్తుంది. ఈ ప్లాన్లు 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 OTT యాప్‌లకు యాక్సెస్ వంటి అదనపు పెర్క్‌లతో పాటు 100 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తాయి. రూ.1199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), జియోసినిమా (JioCinema) ప్రీమియమ్లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి.
జియో AirFiber Max ప్లాన్లు (Jio AirFiber Max plans) :
ఈ కేటగిరీలో జియో వరుసగా రూ. 1499, రూ. 2499, రూ. 3999 ధరలతో 3 ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్లు గరిష్టంగా 1Gbps ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తాయి. 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, Netflix, Amazon Prime, JioCinema ప్రీమియం వంటి 14 OTT యాప్‌లకు యాక్సెస్‌తో సహా అనేక అదనపు బెనిఫిట్స్ అందిస్తాయి.
ముఖ్యంగా, ఎంపిక చేసిన ప్రాంతాలలో జియో AirFiber Max అందుబాటులో ఉంటుంది. వేగవంతమైన స్పీడ్, ఇంటర్నెట్ యాక్సెస్‌తో, జియో ఎయిర్‌ఫైబర్ పేరంట్స్ కంటోల్స్, Wi-Fi 6కి సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. మీరు కొత్త జయో AirFiber కనెక్షన్‌ని పొందాలని ఆలోచిస్తుంటే.. ఇప్పుడే బుక్ చేసుకోండి.