జియో దిమ్మతిరిగే షాక్ : ఫ్రీ కాల్స్ ఎత్తివేత, వేరే నెట్ వర్క్ కు ఫోన్ చేస్తే ఛార్జీలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2019 / 01:24 PM IST
జియో దిమ్మతిరిగే షాక్ : ఫ్రీ కాల్స్ ఎత్తివేత, వేరే నెట్ వర్క్ కు ఫోన్ చేస్తే ఛార్జీలు

రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో  ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు ెదురైనా తక్కువ రేట్లకు కాల్స్,ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న జియో ఇప్పుడు వినియోగదారులకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది

బుధవారం(అక్టోబర్-10,2019)నుంచి జియో సిమ్ నుండి ఎయిర్ టెల్,వోడాఫోన్ వినియోగదారులకు కాల్ చేయాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించక తప్పదు.IUC(ఇంటర్ కనెక్ట్ యాసేజ్ ఛార్జ్)కింద దీనిని వసూలు చేస్తున్నట్లు జియో తెలిపింది. అంటే జియో సిమ్ ఉన్న వినియోగదారులతో కాకుండా ఇతర వినియోగదారులతో మనం కాల్ మాట్లాడాలంటే తప్పక డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జియో సిమ్ నుండి జియో సిమ్ కు చేసే కాల్స్ మాత్రం ఉచితంగానే లభించనున్నాయి. 

మీకు జియో నంబర్ ఉండి మీరు ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్-ఐడియా నంబర్‌కు కాల్ చేస్తే మీరు రింగింగ్ చేసే వరకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తారు. కాల్‌లు మిగతా అన్ని ఆపరేటర్లకు ఇప్పటికీ ఉచితం, 
జియో కొత్తగా విడుదల చేసిన జియో ఐ.యూ.సీ ప్లాన్స్ …
-10 రూపాయలు ప్లాన్ పై124 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 1GB డేటా ఉచితం.
-20 రూపాయల ప్లాన్ పై 249 నిమిషాల ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 2GB డేటా ఉచితం.

50 రూపాయలు ప్లాన్ పై 656 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 5GB డేటా ఉచితం.
-వంద రూపాయలు ప్లాన్ పై 1,362 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 10GB డేటా ఉచితం.