Kia Seltos 2023 : హ్యుందాయ్ క్రెటాకు పోటీగా.. కియా సెల్టోస్ 2023.. జూలై 4నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Kia Seltos 2023 : సెల్టోస్ భారత మార్కెట్లో కియా మొట్టమొదటి మోడల్. టాప్ కార్ల తయారీదారులలో ఒకటిగా కియా కీలక పాత్ర పోషించింది.

Kia Seltos 2023 : హ్యుందాయ్ క్రెటాకు పోటీగా.. కియా సెల్టోస్ 2023.. జూలై 4నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Kia Seltos 2023 unveil in India on July 4

Kia Seltos 2023 unveil in India on July 4 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా (Kia India) జూలై 4న సరికొత్త కియా సెల్టోస్ 2023 (Kia Seltos 2023)ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 2019లో దేశ మార్కెట్లో లాంచ్ తర్వాత ప్రముఖ మధ్యతరహా SUVకి ఫస్ట్ ప్రధాన అప్‌డేట్ అని ప్పవచ్చు. దేశంలో సెల్టోస్ కియా మొదటి మోడల్, అగ్ర కార్ల తయారీదారులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషించింది. సెల్టోస్‌తో పాటు, కియా సోనెట్, కేరెన్స్, కార్నివాల్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది.

కియా దేశీయ విపణిలో 364,115 యూనిట్లకు పైగా సెల్టోస్‌లను విక్రయించగా, కార్‌మేకర్ మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా-పసిఫిక్‌లతో సహా దాదాపు 100 మార్కెట్‌లకు 135,885 యూనిట్ల కన్నా ఎక్కువ SUVలను ఎగుమతి చేసింది. కియా సెల్టోస్ 2023 విషయానికి వస్తే.. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే భారత మార్కెట్లోస్పైడ్ టెస్టింగ్ అయింది. లేటెస్ట్ LED DRLలతో రీడిజైన్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద గ్రిల్, ఫాగ్ ల్యాంప్‌లకు కొత్త హౌసింగ్‌లను పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

Read Also : Ola Electric EV portfolio : ఓలా నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జూలైలోనే లాంచ్.. ముందే హింట్ ఇచ్చిన కంపెనీ సీఈఓ..!

LED టెయిల్‌ల్యాంప్‌లు, మధ్య కనెక్ట్ అయిన బార్‌ను కలిగి ఉంది. అలాగే, ఫ్రంట్, బ్యాక్ బంపర్‌లు కొత్తగా మార్పులు చేసింది. ప్రస్తుతం, కియా సెల్టోస్ 2023 క్యాబిన్‌లో ఎన్ని మార్పులు చేశారనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ వెహికల్ ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరింత అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్‌ను పొందనుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లలోని గేర్ లివర్‌ను డయల్ ద్వారా భర్తీ చేస్తారని పలు నివేదికలు సూచించాయి.

Kia Seltos 2023 unveil in India on July 4

Kia Seltos 2023 unveil in India on July 4

అతిపెద్ద మార్పు సన్‌రూఫ్‌లో ఉండవచ్చు. ప్రస్తుతం, సెల్టోస్ ప్రామాణిక ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. కియా సెల్టోస్ 2023లో పనోరమిక్ సన్‌రూఫ్‌తో భర్తీ అవుతుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి ప్రత్యర్థి మోడల్‌లు ఇప్పటికే పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్నాయి. సెల్టోస్‌లో ప్రస్తుతం 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5-లీటర్ CRDi VGT డీజిల్, పెట్రోల్ యూనిట్ గరిష్టంగా 115PS పవర్, 144Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా IVT ఆటోమేటిక్‌తో ఉండవచ్చు.

డీజిల్ యూనిట్ గరిష్టంగా 116PS శక్తిని 250Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ATతో రావొచ్చు. డీజిల్ ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదు. 6-స్పీడ్ iMT ప్రామాణికమైనది. SUVలో 1.4-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలోనే నిలిపివేసింది. 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో భర్తీ చేయనుందని భావిస్తున్నారు. కియా సెల్టోస్ ధర ప్రస్తుతం రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త కియా సెల్టోస్ 2023 ధర రూ. 11 లక్షల నుంచి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు .

Read Also : Aadhar Card Free Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ తేదీలోగా మీ ఆధార్‌లో ఏదైనా ఫ్రీగా మార్చుకోవచ్చు.. ఆ తర్వాత కష్టమే..!