Mirabai Chanu : ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను

ప్రముఖ న్యూట్రిలైట్ సంస్థ ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్స్ రజత పతకం విజేత మీరాబాయి చాను ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమ్‌వే ఇండియా సంస్థ

Mirabai Chanu : ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను

Mirabai

Updated On : August 17, 2021 / 5:24 PM IST

Amway India : ప్రముఖ న్యూట్రిలైట్ సంస్థ ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్స్ రజత పతకం విజేత మీరాబాయి చాను ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమ్‌వే ఇండియా సంస్థ ప్రకటించింది. ఈ ఒప్పందంపై మీరాబాయి చాను సంతకం చేసింది.

ఇక నుంచి న్యూట్రిలైట్ డైలీ, ఒమేగా, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఆమ్‌వే ప్రచార కార్యక్రమాల్లో మీరాబాయి చాను కనిపించనుంది. దేశంలోని మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యం, పోషకాహార రంగాన్ని ఏకీకృతం చేయటంపై ఆమ్‌వే ఫోకస్ పెట్టింది. ఇందుకోసమే చానుతో ఒప్పందం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమ్‌వే ఇండియా సీఈఓ అన్షు బుధ్రాజా మాట్లాడుతూ మీరాబాయి చానుతో తమ అనుబంధం సహజ ఎంపిక అన్నారు. ఆమె ఫిట్ నెస్ పట్ల కనబర్చిన నిబద్ధత సాటిలేనిదని పేర్కొన్నారు. ప్రజలు మరింత మెరుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాలను గడిపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అందుకే సంస్థ చానును భాగస్వామిగా ఎంచుకునట్లు వెల్లడించారు.

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో చాను 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. చాను రజత పతకం సాధించడంతో దేశ ప్రజలు సర్వత్రా ప్ర‌శంస‌ల‌ వర్షం కురిపిస్తున్నారు. ఆమె భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు.

పోటీలు మొదలైన తొలి రోజే చాను రజతంతో బోణీ కొట్టింది. 26 ఏళ్ల చాను పోయిన చోటే వెతుక్కోవాలనుకుంది. రియో ఒలింపిక్స్‌ చేదు అనుభవాన్ని టోక్యో ఒలింపిక్స్‌ రజతంతో చెరిపేసింది.